Moviesఆ హీరోయిన్‌ను బాంబు పెట్టి చంపేస్తా అని బెదిరించిన ల‌క్ష్మీపార్వ‌తి

ఆ హీరోయిన్‌ను బాంబు పెట్టి చంపేస్తా అని బెదిరించిన ల‌క్ష్మీపార్వ‌తి

టాలీవుడ్ లో గత రెండు దశాబ్దాల్లో ఎంతోమంది కొత్త హీరోయిన్లు వచ్చారు… అయితే వీరిలో తక్కువ మంది మాత్రమే సుదీర్ఘకాలంగా కెరీర్‌ కొనసాగిస్తూ వస్తున్నారు. ఇలాంటి వారిలో నటి పూజిత కూడా ఉంటారు. టాలీవుడ్ లో ఇప్పటి వరకు 130కి పైగా సినిమాల్లో నటించి మంచి నటిగా గుర్తింపు పొందారు. వెండితెరపై ఎన్నో సినిమాల్లో ఎన్నో పాత్రలతో మెప్పించిన పూజిత… ఆ తర్వాత బుల్లితెరపై కూడా ఎంట్రీ ఇచ్చింది. తనకు వెండితెరపై ఉన్న క్రేజ్ కంటిన్యూ చేస్తూ బుల్లితెరపై మంచి పాత్రలు ఎంచుకుంది.

పూజిత గత కొన్ని సంవత్సరాలుగా వెండితెర పై కనుమరుగు అయిపోయారు. అయితే చాలా రోజుల తర్వాత ఇండస్ట్రీలోకి తిరిగి రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ క్ర‌మంలోనే పూజిత వరుస పెట్టి సినిమాలకు సైన్ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె తన తాజా ఇంటర్వ్యూలో తన జీవితం గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. సీనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటించిన ఒక సినిమా విషయంలో ఆయన భార్య లక్ష్మీ పార్వతితో పెద్ద గొడవ జరిగిందని ఈ సందర్భంగా పూజిత చెప్పారు.

అమ్మో అల్లుడా అనే ఒక సినిమాను నిర్మాత కోనేరు రవీంద్ర ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఆ సినిమాలో నా పాత్ర ఎంతో అద్భుతంగా ఉంటుందని చెప్పడంతో ఈ సినిమాకు ఓకే చెప్పాన‌ని… ఇందులో ఎన్టీఆర్ పాత్ర ఉంటుంద‌ని.. ఆయ‌న భార్య పాత్ర‌లో న‌టించాల‌ని నాతో చెప్పార‌ని పూజిత చెప్పింది. ఇందులో ల‌క్ష్మీపార్వ‌తి పేరును ఎక్క‌డా బ‌య‌ట‌కు తీయ‌కుండా పొలిటిక‌ల్‌గా ఈ సినిమాను తెర‌కెక్కించార‌ట‌.

ఎన్టీఆర్ మ‌ర‌ణాంత‌రం కూర్చుని టీ తాగుతున్న ల‌క్ష్మీపార్వ‌తి పీవీ. న‌ర‌సింహారావు వ‌స్తున్నార‌ని తెలియ‌గానే ఆ టీక‌ప్పు కింద పెట్టి భోరున ఏడ్చార‌ట‌. ఆ సీన్‌ను సినిమాలో అలాగే చేయ‌డంతో అది ఆమెకు ఎక్క‌డో బాగా త‌గిలింది అని.. ఆ త‌ర్వాత ఆ సినిమాపై ఆమె తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశార‌ని వాపోయింది. ఆ స‌న్నివేశంలో న‌టించిన ఆ న‌టిని బాంబ్ పెట్టి లేపేయాల‌ని. యాసిడ్ దాడి చేయాల‌ని కూడా ఆమె ఫైర్ అయిన‌ట్టు తెలిసింద‌ని పూజిత చెప్పారు.

అయితే ఆ విష‌యాలు అన్ని ద‌ర్శ‌క నిర్మాత‌లు చూసుకున్నార‌ని.. తాను కేవ‌లం ఒక న‌టిని మాత్ర‌మే అని.. ఆ త‌ర్వాత రెండు మూడు సార్లు ల‌క్ష్మీపార్వ‌తిని క‌లిసినా కూడా ఆమె నాతో స‌రిగా మాట్లాడ‌లేద‌ని పూజిత తెలిపింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news