సీనియర్ నటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి తెలుగులో ఇప్పుడు అత్త , తల్లి, పిన్ని ఇలాంటి సపోర్టింగ్ పాత్రలతో దూసుకుపోతోంది. ఎంత వయసు వచ్చినా కూడా ప్రగతి ఆంటీ తన అందంతో, అభినయంతో స్టార్ హీరోయిన్లకు మించిన హైప్ క్రియేట్ చేసుకుంటుంది. ఎఫ్2 సినిమాలో సీనియర్ హీరోయిన్ వెంకీకి అత్తగా ప్రగతి చేసిన కామెడీ రోల్ ఎలా నవ్వులు పూయించిందో చూశాం. ఈ వయసులో కూడా ప్రగతి ఆంటీ స్టార్ హీరోయిన్లకు పోటీగా సోషల్ మీడియాలో తన హాట్ హాట్ ఫోటోలతో వీనుల విందు చేస్తూ ఉంటుంది.
ఇంకా చెప్పాలంటే ప్రగతి ఆంటీ పోస్ట్ చేసే జిమ్ వీడియోలు, డ్యాన్సులకు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది. చాలా మంది స్టార్ హీరోయిన్లకు లేనంత పాపులారిటీ ఆమెకు సోషల్ మీడియాలో వచ్చేసింది. అసలు ఆమె ఈ వయస్సులో కూడా చేస్తోన్న వర్కవుట్లు చూస్తుంటే చాలా మందికి మతి పోవాల్సిందే. ఈ వర్కవుట్లతోనే ఆమె చాలా సన్నగా మారిపోయింది. అలాగే వెస్ట్రన్ డ్రస్సులతో హీరోయిన్లకు తాను ఏ మాత్రం తీసిపోనని ఫ్రూవ్ చేసుకుంటోంది.
ఇక ఆమె సోషల్ మీడియాలో వేసే స్టెప్పులు కూడా ఈ తరం కుర్రాళ్లకు కూడా పిచ్చెక్కిస్తుంటాయి. తాజాగా ఆమె నాగిని పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసి కుర్రాళ్ల గుండెల్లో సెగ రేపింది. ఈ క్రమంలోనే ఆమె తన తాజా ఇంటర్వ్యూలో సైతం తనకు చిన్నప్పటి నుంచి నాగినీ డ్యాన్స్ అంటే చాలా ఇష్టం అని చెప్పుకు వచ్చింది. ఇక తనకు ఫిట్‌గా ఉండడం అంటే ఇష్టం అని.. ఫిట్నెస్ గురించి తన వీడియోలతో మహిళల్లో స్ఫూర్తి నింపుతున్నందుకు తనకు ఆనందంగా ఉందని కూడా ప్రగతి చెప్పుకు వచ్చింది.