Moviesపుష్ప ఫ‌స్ట్ రివ్యూకు బ్యాడ్ సెంటిమెంట్‌

పుష్ప ఫ‌స్ట్ రివ్యూకు బ్యాడ్ సెంటిమెంట్‌

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా పుష్ప‌. పుష్ప‌ మరికొద్ది గంటల్లోనే థియేటర్లలోకి దిగనుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఆర్య – ఆర్య 2 రెండు సినిమాలు సక్సెస్ అవ్వడంతో కచ్చితంగా వీరి కాంబినేషన్లో పుష్ప హ్యాట్రిక్‌ సినిమా అవుతుందని అందరూ అంటున్నారు. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన పుష్ప సినిమాలో బన్నీ పుష్ప రాజ్‌ పాత్రలో నటిస్తున్నాడు. రష్మిక మందన్న బన్నీ పక్కన తొలిసారిగా జోడీ కట్టింది.

ఇక సీనియర్ హీరోయిన్ సమంత నటించిన ఊ అంటావా మావా ఐటెం సాంగ్‌ ఈ సినిమాపై అంచనాలు పెంచేసింది. బన్నీ కెరీర్ లోనే తొలి సినిమాగా తెరకెక్కిన పుష్ప ఫస్ట్ రివ్యూ ఇప్పటికే వచ్చేసింది. దుబాయ్ సెన్సార్ బోర్డు మెంబర్ అయిన ఉమైర్ సంధు మన తెలుగు సినిమాలకు ముందుగానే రేటింగ్ ఇస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే పుష్ప‌ సినిమా చూసిన ఉమైర్ సినిమాలో అల్లు అర్జున్ కెరీర్లోనే బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు అని… హీరోయిన్ రష్మిక మందన్న కూడా అద‌ర‌ కొట్టేసిందని చెప్పాడు.

అలాగే సుకుమార్ స్టోరీ – స్క్రీన్ ప్లే, డైలాగులు సూపర్ గా ఉన్నాయ‌ని మెచ్చుకున్న ఉమైర్‌ సినిమాకు 4 స్టార్ రేటింగ్ ఇచ్చాడు. ఉమైర్ గతంలో తెలుగు సినిమాలకు సూపర్ హిట్ అన్న రేటింగ్ ఇస్తే అవి ప్లాప్ అయ్యాయి. అలాగే సినిమా బాగోలేదు అని… తక్కువ రేటింగ్ ఇస్తే అవి హిట్ అయ్యాయి. ఉమైర్ ఎక్కువగా హిట్ అవుతాయని చెప్పిన సినిమాలు ఫట్ అయ్యాయి.

దీంతో ఇప్పుడు ఫస్ట్ రివ్యూ ఈ విషయంలో ఈ బ్యాడ్ సెంటిమెంట్‌ను పుష్ప రేపు థియేట‌ర్ల‌లో ఎలా ? బ్రేక్ చేస్తుందో చూడాలి. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా పుష్ప సినిమాపై భారీ క్రేజ్‌ ఉంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ లు కూడా భారీగా జరుగుతున్నాయి. తెలుగుతో పాటు తమిళ – కన్నడ – మలయాళం హిందీలో పుష్ప‌ భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news