2000వ దశకంలో కహోనా ఫ్యార్ హై సినిమాతో వెండితెరపై హీరోగా ఎంట్రీ ఇచ్చిన హృతిక్ చాలా తక్కువ టైంలోనే అప్పటి ఖాన్ హీరోలకు షాక్ ఇస్తూ స్టార్ హీరో అయిపోయాడు. అప్పట్లో యువత అయితే హృతిక్ పేరు చెపితే పిచ్చెక్కిపోయి ఊగిపోయేవారు. చాలా తక్కువ టైంలోనే సూపర్ హిట్ సినిమాలతో దూసుకుపోయాడు. ధూమ్ సీరిస్, క్రిష్ సీరిస్ సినిమాలో హృతిక్‌కు నేషనల్ లెవల్లో వచ్చిన పేరు అంతా ఇంతా కాదు.
తొలి సినిమా హిట్ అయ్యాక హృతిక్ తన చిన్ననాటి స్నేహితురాలు సుసానే ఖాన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వీరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వీరు తమ పిల్లల కోసం అప్పుడప్పుడూ కలుస్తూనే ఉంటారు. ఇదిలా ఉంటే హృతిక్‌కు విడాకులు ఇచ్చాక సుసానే మరో నటుడు అర్స్లాన్స్ గోనితో డేటింగ్లో ఉందని వార్తలు ఉన్నాయి.
అయితే ఈ రూమర్లపై ఇప్పటి వరకు వీరు స్పందించలేదు. తాజాగా వీరిద్దరు సన్నిహితంగా ఉన్న ఫొటోలు బయటకు రావడంతో వీరు డేటింగ్లో ఉన్నారన్న వార్తలకు మరింత బలం చేకూరింది. గోనీ బర్త్ డే సందర్భంగా సుసానే అతడితో క్లోజ్ ఉన్న ఫొటోలు బయటకు వచ్చాయి. అతడికి బర్త్ డే విషెస్ చెపుతూ ఆమె పోస్ట్ చేసింది. తన లైఫ్‌లో ఇప్పటి వరకు చూసిన అందమైన శక్తి అతడే అంటూ ఆకాశానికి కూడా ఎత్తేసింది.
దీంతో నెటిజన్లు కూడా సుసానే కొత్త భాయ్‌ఫ్రెండ్ గోనీ అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు. ఇక సుసానే పెట్టిన పోస్ట్‌కు కూడా గోనీ ఐలవ్ యూ అంటూ రిప్లే ఇచ్చాడు. ఇక అక్టోబర్‌లో సుసానే బర్త్ డే సందర్భంగా గోనీ కూడా హ్యాపీ బర్త్ డే డార్లింగ్ అంటూ విషెస్ చెప్పాడు. వీరి డేటింగ్ విషయంపై హృతిక్ ఫ్యాన్స్ మాత్రం మండిపడుతున్నారు. ఇక హృతిక్‌కు దూరమయ్యాక గోనీ కంటే ముందు సుసానే మరో బాలీవుడ్ నటుడితో కూడా కొద్ది రోజులు డేటింగ్లో ఉందన్న వార్తలు వచ్చాయి.