సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు అనేవి కామన్. అలాగే బ్రేకప్‌లు కూడా చాలా కామన్. కొందరు అయితే ప్రేమించి ఎంగేజ్‌మెంట్ చేసుకుని.. పెళ్లి వరకు వచ్చాక కూడా విడిపోతారు. సాధారణ మనుష్యుల్లో ఇలాంటి సంఘటనలు తక్కువే అయినా సెలబ్రిటీల మధ్య ఇగోలు ఎక్కువ. వారు ఏ విషయంలోనూ రాజీ పడరు. అందుకే వారి ప్రేమ వివాహాల మధ్య అన్యోన్యతలు, అప్యాయతలు కూడా తక్కువుగా ఉంటాయి. ఈ క్రమంలోనే వారు ఎప్పుడు ప్రేమలో ఉంటారో ? ఎప్పుడు విడిపోతారో ? కూడా తెలియదు. ఇలా ప్రేమించుకుని పెళ్లి వరకు వచ్చి పెళ్లి చేసుకోకుండా విడిపోయిన కొందరు సెలబ్రిటీల గురించి తెలుసుకుందాం..!
రష్మిక – రక్షిత్ శెట్టి:
ప్రస్తుతం సౌత్ ఇండియాను ఊపేస్తోన్న స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న.. కన్నడ హీరో రక్షిత్ శెట్టితో ప్రేమలో పడింది. వీరిద్దరు కలిసి నటించిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఆ టైంలోనే వీరు ప్రేమలో పడి ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్నారు. ఆ తర్వాత రష్మిక కెరీర్ మారిపోయింది. దీంతో ఆమె రక్షిత్‌కు బ్రేకప్ చెప్పేసి పూర్తిగా సినిమాల మీద దృష్టి పెట్టేసింది.
ఉదయ్ కిరణ్ – సుస్మిత:
మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె, దివంగత యంగ్ హీరో ఉదయ్ కిరణ్‌కు ఎంగేజ్‌మెంట్ కూడా జరిగింది. ఉదయ్ కిరణ్ వరుస హిట్లతో ఉన్నప్పుడు పెద్దల అంగీకారంతోనే వారికి పెళ్లి చేయాలని అనుకున్నారు. ఈ క్రమంలోనే ఎంగేజ్‌మెంట్ అయ్యాక కూడా పెళ్లి చేయకుండానే అది క్యాన్సిల్ చేశారు.
అఖిల్ – శ్రీయా భూపాల్:
అక్కినేని నాగార్జున రెండో తనయుడు అక్కినేని నవ మన్మథుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త జీవీకే రెడ్డి మనవరాలు శ్రియా భూపాల్ ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఇటలీలో అంగరంగ వైభవంగా వీరి పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్న టైంలోనే మనస్పర్థలు రావడంతో వీరు విడిపోయారు. ఆ తర్వాత శ్రీయా చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కుమారుడిని పెళ్లి చేసుకోగా.. అఖిల్‌కు ఇంకా పెళ్లి కాలేదు.
మెహ్రీన్ – భవ్య భిష్ణోయ్ :
క్రేజీ హీరోయిన్ మెహ్రీన్‌కు, హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్ మనవడు భవ్య బిష్ణోయ్‌కు ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందో కాని మెహ్రీన్‌కు ఈ పెళ్లి నచ్చక ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ చేసుకుంది.
తరుణ్ – అర్తీ అగర్వాల్:
తరుణ్ – దివంగత హీరోయిన్ అర్తీ అగర్వాల్ ప్రేమించు కున్నారు. వీరు నువ్వులేక నేను లేను, సోగ్గాడు సినిమాల్లో కలిసి నటించారు. వీరు పెళ్లి చేసుకుంటారనుకుంటోన్న టైంలోనే ఈ పెళ్లి తరుణ్ తల్లి రోజా రమణికి ఇష్టంలేకపోవడంతో విడిపోయారు. ఆ తర్వాత ఆర్తీ మరో పెళ్లి చేసుకున్నా.. ఆ భర్తకు విడాకులు ఇచ్చేసింది. తర్వాత శస్త్రచికిత్స వికటించి మృతి చెందింది.
త్రిష – వరుణ్ మణియన్ :
సీనియర్ హీరోయిన్ త్రిష, పారిశ్రామిక వేత్త వరుణ్ పెళ్లికి ఎంగేజ్‌మెంట్ కూడా జరిగింది. పెళ్లి త్వరలో జరుగుతుంది అనుకుంటోన్న టైంలో అభిప్రాయ బేధాలతో విడిపోయారు.
శింబు – హన్సిక :
శింబు ముందుగా నయనతారను ప్రేమించాడు. వారిద్దరు పెళ్లి చేసుకుంటారనుకుంటోన్న టైంలో విడిపోయారు. ఆ తర్వాత హన్సికతో ప్రేమలో పడ్డాడు. వీరు కూడా పెళ్లి చేసుకుంటారు అనుకున్న టైంలో మనస్పర్థలతో విడిపోయారు.
ప్రభుదేవా – నయనతార :
శింబుతో బ్రేకప్ తర్వాత నయనతార ప్రభుదేవాను ప్రేమించింది. నయనతారను పెళ్లి చేసుకునేందుకే ప్రభుదేవా తన భార్య రమలత్‌కు విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత వారి మధ్య గ్యాప్ రావడంతో విడిపోయారు.