Moviesస‌మంత‌పై ర‌ష్మిక సంచ‌ల‌న కామెంట్స్‌

స‌మంత‌పై ర‌ష్మిక సంచ‌ల‌న కామెంట్స్‌

అక్కినేని హీరో నాగ‌చైత‌న్య‌తో విడాకుల త‌ర్వాత స్టార్ హీరోయిన్ స‌మంత ఇప్పుడు కెరీర్‌పై పూర్తిగా కాన్‌సంట్రేష‌న్ చేస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. తాజాగా బ‌న్నీ పుష్ప సినిమాలో ఊ అంటావా .. ఊఊ అంటావా అంటూ రిలీజ్ చేసిన ప్రోమోకు కూడా అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది. ఇక పుష్ప ఈ నెల 17న థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది. ఇప్ప‌టికే ప్రి రిలీజ్ ఈవెంట్ కూడా జ‌రిగింది.

ఈ ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మంలో ర‌ష్మిక మాట్లాడుతూ తాను హీరోయిన్‌గా చేసిన సినిమాలో స‌మంత ఐటెం సాంగ్ చేయ‌డం ఆనందంగా ఉంద‌ని.. అయితే తాను స‌మంత‌లా చేయ‌లేన‌ని కూడా చెప్పింది. నా సినిమాలో స‌మంత స్పెష‌ల్ చేయ‌డం ఖుషీ అని.. ఆమెకు తాను మెసేజ్ కూడా చేశాన‌ని.. స‌మంత ఈ సాంగ్ చేయ‌డం చాలా గ్రేట్‌… ఇలాంటి ఆఫ‌ర్ త‌న‌కు వ‌స్తే ఒక‌టికి రెండు సార్లు ఆలోచిస్తాన‌ని.. అలాంటిది స‌మంత స్టార్ హీరోయిన్ అయ్యి ఉండి కూడా ఈ సాంగ్ చేసిందంటూ ప్ర‌శంసించింది.

అలాగే మ‌రో ఆస‌క్తిక‌ర విష‌యం కూడా ర‌ష్మిక చెప్పింది. పుష్ప సినిమా చేసే ముందు అస‌లు ఈ క‌థ ఏంటో తెలియ‌కుండానే తాను ఈ సినిమాకు సైన్ చేశాన‌ని చెప్పింది. అయితే సినిమాకు ముందుగా కేవ‌లం చిత్తూరు యాస మాత్ర‌మే నేర్చుకుంటే స‌రిపోతుంద‌ని ఆమెకు చెప్పాడ‌ట‌. పుష్ప సినిమా స్క్రిఫ్ట్‌, క్యారెక్ట‌ర్ ఏంటో తెలియద‌ని ర‌ష్మిక చెప్పింది.

తాను సుకుమార్ ప్ర‌పంచంలోకి ఎంట‌ర్ కావాల‌న్న కోరిక ఉంద‌ని.. అందుకే తాను సుకుమార్‌కు పూర్తిగా స‌రెండ‌ర్ అయిపోయాన‌ని చెప్పింది. ఇక చిత్తూరు యాస కూడా సుకుమార్ కోస‌మే క‌ష్ట‌ప‌డి మ‌రీ నేర్చుకున్నాన‌ని తెలిపింది. ఇక పుష్ప సినిమాలో ర‌ష్మిక శ్రీ వ‌ల్లి పాత్ర చేసింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news