Moviesఆ భాషలో డబ్బింగ్ చెప్పకపోడానికి కారణం అదే.. ఎన్టీఆర్ క్లారిటీ..!!

ఆ భాషలో డబ్బింగ్ చెప్పకపోడానికి కారణం అదే.. ఎన్టీఆర్ క్లారిటీ..!!

అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురుచూస్తున్న రోజు మరి కొద్ది రోజుల్లో రాబుతుంది. అటు నందమూరి అభిమానులు ఇటు మెగా అభిమానులు ఇద్దరు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా రణం రౌద్రం రుధిరం. దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం RRR పై ఎన్ని అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్టీఆర్, రామ్ చరణ్‌‌‌లు కలిసి నటిస్తుండడంతో ఈ సినిమా పైన అంచనాలు భారీ స్థాయిలో పెట్టుకున్నారు అభిమానులు.

దీనికి తోడు రిలీజైన ట్రైలర్‌‌‌కు కూడా మంచి రెస్పాన్స్ రావడంతో ఆ అంచనాలు మరింతగా పెరిగాయి. ఇప్పటికే షూటింగ్‌‌ పార్ట్‌‌‌‌ను కంప్లీట్ చేసుకున్న సంక్రాంతి పండగ కానుకగా ఈ సినిమా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలో టీంమొత్తం ప్రమోషన్ లలో బిజీ అయిపొయింది. రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమాను తెరకెక్కించడంలోనే కాదు..ఆ సినిమాను ప్రమోట్ చేసుకోవడంలోను ఆయనకు సరిలేరు ఎవరు. పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రమోషన్స్ ని కూడా అదే రేంజ్ లో చేస్తుండడం గమనార్హం.

ఆర్ ఆర్ ఆర్ సినిమా తెలుగు, తమిళ, కన్నడ ,హిందీ, మలయాళ భాషలల్లో రాజమౌళి తెరకెక్కించారు. ఇక రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ వాళ్ల పాత్రలకు వాళ్లే డబ్బింగ్ చెప్పుకున్నారు. తెలుగు,హిందీ,తమిళ్, కన్నడ ఈ నాలుగు భాషలల్లో వాళ్ల క్యారెక్టర్లకు వాళ్లే డబ్బింగ్ చెప్పుకున్న ఈ హీరోలు మలయాళ భాషలో మాత్రం డబ్బింగ్ చెప్పలేదు. ఇక ఇదే విషయాని ఆర్ ఆర్ ఆర్ ప్రెస్ మీట్ లో విలేకరులు అడగ్గా..తారక్ క్లారిటీ ఇస్తూ..”హైదరాబాద్‌లో పుట్టి పెరగడం వల్ల హిందీపై కాస్త పట్టు ఉందని చెప్పుకొచ్చిన ఆయన.. ఎలాగోలా హిందీ నేర్చుకొని డబ్బింగ్ చెప్పాము. ఇక తమిళం అంతో ఇంతో వచ్చు కాబట్టి అక్కడ కూడా పెద్ద ప్రాబ్లం రాలేదు.

ఇక ఎన్టీఆర్ కి కన్నడ భాష బాగా వచ్చు. ఆయన తల్లి శాలిని కర్ణాటక నుంచి వచ్చారు. దాంతో కన్నడ అద్భుతంగా మాట్లాడుతాడు జూనియర్ ఎన్టీఆర్. ఇక అక్కడ కూడా ఆయనకు పెద్ద సమస్య రాలేదు. రామ్ చరణ్ కూడా ఎలాగోలా కష్టపడి కన్నడలో డబ్బింగ్ చెప్పాడు. అన్ని భాషల్లోనూ ఇద్దరు హీరోలు అద్భుతంగా కవర్ చేశారు కానీ.. మలయాళంలో మాత్రం అటు జూనియర్ ఎన్టీఆర్.. ఇటు రామ్ చరణ్ ఇద్దరు డబ్బింగ్ చెప్పలేదు. ఒక్క బాష మనం మాట్లాడాలి అంటే ఖచ్చితంగా కాస్తో కూస్తో పట్టు ఉండాలి.భాష తెలియనప్పుడు డబ్బింగ్ చెప్పలేము. వచ్చి రాని మాటలతో అనవసరంగా ఆ భాషను కించ‌ప‌ర‌చ‌కూడ‌దనే ఉద్దేశంతోనే మలయాళంలో డబ్బింగ్ చెప్పలేదు అంటూ క్లారిటీ ఇచ్చాడు ఎన్టీఆర్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news