Moviesకేక పెట్టిస్తున్న క్రేజీ అప్డేట్: త్రివిక్ర‌మ్‌-మ‌హేశ్ సినిమాలో విలన్ గా ఆ...

కేక పెట్టిస్తున్న క్రేజీ అప్డేట్: త్రివిక్ర‌మ్‌-మ‌హేశ్ సినిమాలో విలన్ గా ఆ బడా హీరో..

కోన్ని కాంబినేషన్స్ తెర పై మళ్లీ మళ్లీ చుడాలి అనిపిస్తూ ఉంటాయి. అలాంటి వాటిలో త్రివిక్ర‌మ్‌-మ‌హేశ్ కాంబినేషన్ కూడా ఓటి. వీళ్ల కాంబో అదుర్స్ అని చెప్పలి. ఎంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తో, ఫన్నీ పంచ్ డైలాగులతో..ఫుల్ ఎంటర్ టైన్ చేస్తూంది ఈ కాంబినేషన్. ఇప్పటికే ఈ కాంబినేష‌న్‌లో బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి. అందులో ముఖ్యంగా అత‌డు సినిమా గురించి మనం చెప్పుకోవాలి. సైలెంట్ లుక్స్ తో కూడా మహేష్ దగ్గర కామెడీ డైలాగ్స్ చెప్పించారు ఈ సినిమాలో త్రివిక్ర‌మ్‌. ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద ఎంతటి ఘన విజయాని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఇక ఆ త్రువాత వచ్చిన ఖ‌లేజా. ఈ సినిమా బాక్స్ ఆఫిస్ దగ్గర పెద్దగా సక్సెస్ కాలేకపోయిన బుల్లితెర పై మాత్రం మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ సినిమా లో మహేష్ బాబు ని దేవుడిగా చేసి చూయించడం ..ఆ టైమింగ్ లో కామెడి డైలాగ్స్ పెట్టడం సినిమా కి భారీ మైనస్ పాయింట్ గా నిలిచింది, కానీ ఎంటర్ టైన్ మెంట్ మ్యాటర్ మాత్రం ఖ‌లేజా మూవీ కూడా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక చాలా ఏళ్ల తరువాత ఈ కాంబో రిపీట్ అవుతుంది. ఈ ఇద్ద‌రి క‌ల‌యిక‌లో మ‌రో సినిమారాబోతుందని ఇప్ప‌టికే క్రేజీ అప్ డేట్స్ తెర‌పైకి వ‌చ్చాయి.

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాకు ముహూర్తం ఫిక్స్ అయిందా అంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. #SSMB28 అని అభిమానులు ముద్దుగా పిలుచుకుంటున్న ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఒక రివెంజ్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోందట. వీళ్ల కాంబినేషన్‌లో రాబోతున్న మూడో సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సంజ‌య్ ద‌త్ విలన్ పాత్ర‌లో న‌టించ‌బోతున్నాడ‌ని ఇప్ప‌టికే వార్త‌లు వ‌చ్చాయి. “మహర్షి” సినిమాలో మహేష్ బాబుతో రొమాన్స్ చేసిన పూజ హెగ్డే ఈ సినిమాలో కూడా హీరోయిన్ గా కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news