Moviesబాల‌య్య - అనిల్ రావిపూడి బ‌డ్జెట్ పెద్ద షాక్ ఇస్తోందే...!

బాల‌య్య – అనిల్ రావిపూడి బ‌డ్జెట్ పెద్ద షాక్ ఇస్తోందే…!

యువ‌ర‌త్న‌, నటసింహా నందమూరి బాలకృష్ణ అఖండ సినిమాతో మ‌రో భారీ హిట్ అందుకుని మంచి ఉత్సాహంతో ఉన్నారు. బాల‌య్య‌, బోయ‌పాటి ఈ క‌రోనా పాండ‌మిక్ టైంలో కూడా క‌సితో అఖండ చేసి త‌మ‌ది హ్యాట్రిక్ కాంబినేష‌న్ అని బ‌ల్ల‌గుద్ది మ‌రీ హిట్ కొట్టారు. ఇక ఇప్పుడు బాల‌య్య వ‌రుస పెట్టి సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. ప్ర‌స్తుతం త‌న 107వ సినిమాను క్రాక్ డైరెక్ట‌ర్ మ‌లినేని గోపీచంద్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్నారు. అఖండ సినిమాతో బాల‌య్య బ్రాండ్ ఇమేజ్ మ‌రింత మెరుగు ప‌డింది.

ఇక మ‌లినేని గోపీచంద్ సినిమా త‌ర్వాత బాల‌య్య‌, అనిల్ రావిపూడితో మ‌రో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాపై కూడా బాల‌య్య అఫీషియ‌ల్‌గా క్లారిటీ ఇచ్చేశారు. అస‌లు బాల‌య్య‌తో అనిల్ రావిపూడి రెండేళ్ల క్రిత‌మే సినిమా చేయాల్సి ఉంది. రామారావు గారు అన్న టైటిల్‌తో వీరి కాంబోలో సినిమా వ‌స్తుంద‌ని అంద‌రూ అనుకున్నారు. అయితే అనిల్ రావిపూడి స‌రిలేరు నీకెవ్వ‌రు, ఇప్పుడు ఎఫ్ 3 సినిమాల్లో బిజీ కావ‌డం, ఇటు బాల‌య్య కూడా త‌న ప్రాజెక్టుల్లో బిజీ కావ‌డంతో ఈ సినిమా ప‌ట్టాలు ఎక్క‌లేదు.

ఇక ఇప్పుడు బాల‌య్య 108వ ప్రాజెక్టు అనిల్ రావిపూడితోనే క‌న్‌ఫార్మ్ అయిపోయింది. ఈ సినిమాకు ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా రు. 60 కోట్ల బ‌డ్జెట్ కేటాయిస్తున్నార‌ట‌. సాహూ గార‌పాటి, హ‌రీష్ పెద్ది సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అఖండ ఇప్ప‌టికే రు. 50 కోట్ల షేర్‌, రు. 70 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఈ ధీమాతోనే అనిల్ రావిపూడి సినిమాకు ఇంత భారీ బడ్జెట్ పెడుతున్నార‌ట‌.

వ‌య‌స్సు మీద ప‌డుతున్నా కానీ బాల‌య్య రేంజ్‌, క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌లేద‌న‌డానికి ఇంత‌క‌న్నా నిద‌ర్శ‌నం ఏం ? కావాలి. ఓ వైపు అహాలో అన్‌స్టాప‌బుల్ షో, ఇటు అఖండ‌తో పాటు సోష‌ల్ మీడియాలో నంద‌మూరి ఫ్యాన్స్ పూన‌కాలు చూస్తుంటే బాల‌య్య క్రేజ్ మామూలుగా లేద‌నే చెప్పాలి. ఇక త‌న‌యుడు మోక్ష‌జ్ఞ‌తో క‌లిసి ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 సినిమాలో కూడా న‌టిస్తాన్న‌ది తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news