అసిన్..ఈ అమదాల తార గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. లంగా వోణీ వేస్తే చూడటానికి అచ్చం తెలుగూమ్మాయిగా కనిపించినా..నిజానికి ఈమె తెలుగులో తమిళ అమ్మాయిగా పరిచయమైన మలయాళీ భామ. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో తనదైన స్టైల్లో నటించి మెప్పించి కోట్లాది మంది అభిమానులను సొతం చేసుకున్న ఈ కేరళ కుట్టి అనతి కాలంలోనే బడా హీరోస్ తో నటించి మంచి మార్కులు కొట్టేసింది. ‘నరేంద్రన్ మకన్ జయకాంతన్ వక’ అనే మలయాళ సినిమాతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ నేచురల్ యాక్టింగ్ కు ఎవరైనా పడిపోవాల్సిందే.
తెలుగులో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అమ్మ..నాన్న ఓ తమిళ అమ్మాయి’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే తెలుగులో కూడా తిరుగులేని విజయాని అందుకుంది. ఈ మూవీతో ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ దక్కించుకుంది. ఈ మూవీ సక్సెస్‌తో వరుసగా బడా హీరోల సరసన నటించే చాన్స్ కొట్టేశింది. ఇక గజినీ సినిమాతో బాలీవుడ్ టాప్ హీరోయిన్ అయింది. అసిన్‌కు ఏడు భాషలు మాట్లాడటం వచ్చు. తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్, పంజాబీ, మరాఠీ, గుజరాతి, ఫ్రెంచ్ భాషలు అనర్గళంగా వచ్చు. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఎక్కువగా కెవ్లో పదం వాడుతుంది.
నిజానికి అసిన్ కి ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. ఫుల్ గ్లామర్, యాక్టింగ్ స్కిల్స్ ఉన్న హీరోయిన్ గా ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్న ఈ అమ్మడుకు కొంచెం డబ్బు పిచ్చి ఎక్కువే ఉందట.అందుకే మంచి మంచి సినిమాలు చేసే అవకాశం వచ్చినా నిర్మాతలు రెమ్యూనరేషన్ తక్కువగా ఆఫర్ చేస్తున్నారని సినిమాలను వదిలేసుకుందట. భారీ రెమ్యునరేషన్ కోసం ఆశపడి.. మంచి మంచి సినిమాల్లో నటించే అవకాశాలను చేజార్చుకుంది అసిన్.
బిజీగా ఉన్న సమయంలోనే మైక్రోమ్యాక్స్ సహ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మను 2016లో వివాహం చేసుకుంది. హీరో అక్షయ్ కుమార్ వల్లనే అసిన్-రాహుల్ శర్మ వివాహం జరిగింది. అక్షయ్, రాహుల్ స్నేహితులు. అక్షయ్ మూవీలో హీరోయిన్‌గా చేసిన అసిన్‌కు… ఓ ఫంక్షన్లో రాహుల్‌తో పరిచయం ఏర్పడింది. అలా ఏర్పడిన పరిచయమే ప్రేమగా మారి ఆపై పెళ్లికి దారి తీసింది. వీరి ప్రేమకు అక్షయ్ కుడా హెల్ప్ చేశాడు.వీరికి 2017లో అరిన్ జన్మించింది.