Moviesవెంక‌టేష్‌ను తాతా అంటూ ఆట ప‌ట్టించిందిగా... (వీడియో)

వెంక‌టేష్‌ను తాతా అంటూ ఆట ప‌ట్టించిందిగా… (వీడియో)

సినీ హీరో విక్టరీ వెంకటేష్ ఇండస్ట్రీలో వివాదాలు లేని వ్యక్తిగా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. ఫ్యాన్సీ ఇగోలు, ఫ్యాన్స్ మధ్య యుద్ధాలు లేని ఒకే ఒక్క హీరో వెంకటేష్ అని చెప్పాలి. వెంకీ మామ అని ప్రేక్షకులు ముద్దుగా పిలుచుకునే ఆయన సినిమా అంటే ఫ్యాన్స్ మధ్య యుద్ధాలు పక్కన పెట్టి చేస్తూ ఉంటారు. వెంకటేష్ కు అస్సలు ఇగోలు ఉండవు. పవన్ కళ్యాణ్‌తో గోపాల గోపాల – మహేష్ బాబుతో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు – రామ్ తో మసాలా – నాగచైతన్యతో వెంకీ మామ లాంటి మల్టీస్టారర్ సినిమాలు చేశారు. ఇప్పటి తరం స్టార్ హీరోలతో కూడా కలిసి మల్టీస్టారర్ సినిమాలు చేస్తున్న ఏకైక హీరోగా వెంకటేష్ నిలిచిపోయారు.

వెంకటేష్ బయటకు కూడా పెద్దగా రారు. ఇక ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కూడా బయట కనిపించ‌రు. ఇటీవల వెంకటేష్ పెద్ద కుమార్తె ఆశ్రిత ఇన్ఫినిటి ప్లాట‌ర్‌ పేరుతో ఒక వంట అధారిత యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. అందులో తన వంటకాలతో పాటు ఫ్యామిలీ విషయాలు కూడా పంచుకుంటోంది. తాజా ప్రోమో ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఈ ప్రోమోకు చాలా స్పెషాలిటీ కూడా ఉంది. ఈ ఎపిసోడ్‌కు వెంకీ మ‌న‌వ‌రాలు గెస్ట్‌గా హాజ‌రైంది.

అంతే కాకుండా తాత వెంకీతో క‌లిసి హంగామా కూడా చేసింది. అయితే వెంక‌టేష్ తాత‌య్య ఎప్పుడు అయ్యాడా ? అని కంగారుప‌డొద్దు.. ఆమె సురేష్‌బాబు మ‌న‌వ‌రాలు. ఈ పాపే నాగ‌చైత‌న్య – స‌మంత పెళ్లిలో కూడా అప్పుడు సెంట‌ర్ ఆఫ్ ఎట్రాక్ష‌న్‌గా మారింది. సురేష్‌బాబు కుమార్తె మాళ‌విక కుమార్తె బేబీ ఐరా అశ్రిత‌తో క‌లిసి సంద‌డి చేసింది.

ఐరాకు ఇష్ట‌మైన వైట్ చాక్లెట్ యునికార్న్ ఫ‌డ్జ్‌ని అశ్రిత త‌యారు చేశారు. ఐరా కూడా ఈ వంట‌కం త‌యారు చేస్తున్న‌ప్పుడు అక్క‌డే ఉండి దానిని ఎంజాయ్ చేసింది. అంతే కాకుండా ఆ వంట‌కం టేస్ట్ చేసేందుకు వెంకీ రావడంతో పాటు ఆ వీడియోలో వెంకీని ఐరా తాతా అని పిల‌వ‌డం కూడా ముచ్చ‌ట‌గా మురిపెంగా ఉంది. ఈ పూర్తి వీడియో త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది.

 

 

View this post on Instagram

 

A post shared by Infinity Platter (@infinityplatter)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news