Moviesపరుచూరి గోపాలకృష్ణ అలా చేసి ఉండకపోతే రంజిత లైఫ్ ఎంత బాగుండేదో..?

పరుచూరి గోపాలకృష్ణ అలా చేసి ఉండకపోతే రంజిత లైఫ్ ఎంత బాగుండేదో..?

సినీ ఇండస్ట్రీ అంటేనే ఓ రంగుల ప్రపంచం. ఇక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఈ రంగుల ప్రపంచంలో ఏది నిజం ఏది అబద్దం తెలియాలంటే కాస్త సమయం పడుతుంది. ఇంతలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.ఇలా ఈ రంగుల ప్రపంచం మాయలోపడి ఎంతోమంది నటీనటులు దారుణంగా మోసపోయిన దాఖలాలు ఉన్నాయి. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఎంతో కష్టపడి ఉన్నత స్థానానికి చేరుకుని ఎంతో సులభంగా ఇతరుల చేతిలో మోసపోయిన వారు ఉన్నారు.

ఇక కొందరు హీరోయిన్ లు అయితే తప్పు చేస్తున్నాం అని తెలిసి తప్పుడు నిర్ణయాలతో తమ జీవితాని సర్వ నాశనం చేసుకున్నారు. అలాంటి వారిలో హీరోయిన్ రంజిత కూడా ఒకరు. తెలుగులో 1990వ సంవత్సరంలో మోహన్ బాబు హీరోగా నటించిన కడప రెడ్డెమ్మ అనే చిత్రం ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం అయిన హీరోయిన్ రంజిత ..వచ్చి రావడంతోనే మోహన్ బాబు వంటి స్టార్ హీరోతో కలిసి నటించే అవకాశం దక్కించుకోవడం అలాగే ఏ పాత్రనైన ఇట్టే ఇమిడిపోయి నటించే టాలెంట్ ఉండడంతో కొంతమేర సినిమా అవకాశాలు కష్టపడకుండానే వచ్చాయని చెప్పవచ్చు. కానీ తాను ఒక్కటి తలిస్తే దైవం ఒక్కటి తలచింది అన్నట్లు.

పరుచూరి గోపాలకృష్ణ రంజితను తన కూతురిగా భావించి కెరీర్ లో బాగా సెటిల్ అవుతుందని హీరోయిన్ గా ట్రై చేయమని రంజిత వాళ్ల నాన్నకు చెప్పారు. నిజానికి రంజిత కెరీర్‌కు తిలకం దిద్దింది పరుచూరినే. పరచూరి మూడో కూతురికి రంజిత మంచి ఫ్రెండ్.. ఈ క్రమంలోనే ఓ సారి తన ఇంటికి రంజిత రావడంతో ఆయన తనను పిలిస్తే వెనక్కు తిరిగి కళ్లు ఎగరేసిందిని ఓ ఇంటర్వ్యుల్లో చెప్పుకొచ్చారు.

అప్పుడే వాళ్ల నాన్నను కలిసి పరచూరి రంజితను హీరోయిన్ గా చేయమని సలహా ఇచ్చాడట. అయితే వాళ్ల నాన్న ఎందుకులెండి సర్.. మావి చిన్న బ్రతుకులు మర్యాదాగా బ్రతికే వాళ్లం అంటూ చెప్పిన పరచూరి రంజిత లైఫ్ బాగుంటుంది ఆమెకు ఆ టాలెంట్ ఉంది అంటూ నచ్చజెప్పారట. ఇక ఆ తరువాత హీరోయిన్ మంచి పేరు తెచ్చుకున్న రంజిత..నిత్యానంద‌తో క‌లిసి నడిపిన రాస‌లీల వ్యవహారంతో కెరీర్ లో అవకాశాలు లేక నా అన్న వాళ్లు దగ్గరకు రానివ్వక కెరీర్ ను నాశనం చేసుకుంది. ఆ రోజు పరచూరి ఈమెను హీరోయిన్ చేసి ఉండకపోతే..ఈరోజు ఈమె లైఫ్ మరోలా ఉండేది అంటూ అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news