దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి సినిమాతో తెలుగు సినిమా చేయాలని ప్రపంచవ్యాప్తంగా చాటారు. ఇప్పుడు రాజమౌళికి కేవలం మన దేశంలో మాత్రమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమా కోసం కోట్లాది మంది అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. రాజమౌళి అంటే ఇండస్ట్రీలో అందరికీ ఎంతో గౌరవం. రాజమౌళిని మెచ్చుకునే దర్శకులు ఎంతోమంది ఉంటారు. అలాగే రాజమౌళి అభిమానించే దర్శకులు కూడా ఉన్నారు.
టాలీవుడ్ లో మాస్ సినిమాలు తెరకెక్కించడంలో అందెవేసిన చేయి అయిన వి.వి.వినాయక్ అంటే రాజమౌళికి ఎంతో ఇష్టం. వినాయక్ అంటే రాజమౌళికి ఎంత ఇష్టం అంటే ఒక ఇంటర్వ్యూలో త్రివిక్రమ్ ,వినాయక్ ఇద్దరిలో మీకు ఎవరు ఇష్టం అని అడిగితే రాజమౌళి ఠక్కున వినాయక్ పేరు చెప్పి అతడిపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. వాస్తవంగా చూస్తే వినాయక్, రాజమౌళి, త్రివిక్రమ్ ముగ్గురు కూడా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చి ఇండస్ట్రీలో టాప్ దర్శకులుగా కొనసాగుతున్నారు.
అయితే రాజమౌళి వినాయక్‌వి పక్క పక్క గ్రామాలు. రాజమౌళిది కొవ్వూరు కాగా.. వినాయక్‌ది అదే నియోజకవర్గంలోని చాగల్లు స్వస్థలం. అలాగే రాజమౌళి, వినాయక్ ఇద్దరూ కూడా ఒకే సమయంలో ఇండస్ట్రీ లోకి వచ్చారు. రాజమౌళి 2001లో వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో దర్శకుడు అయితే… వినాయక్ ఆ మరుసటి సంవత్సరం 2002 మార్చిలో వచ్చిన ఆది సినిమాతో దర్శకుడు అయ్యారు.
అలా కెరీర్ ప్రారంభం నుంచే వీరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. వినాయక్ తన వ్యక్తిగత విషయాలను ఎన్నోసార్లు రాజమౌళితో పర్సనల్‌గా షేర్ చేసుకుంటూ ఉంటారు. చెన్నకేశవరెడ్డి సినిమా అంచనాలు అందుకోలేదని అప్పుడు బాలయ్య గారు వినాయక్ తో సినిమా ఫ్లాప్ అయిందని నువ్వేం ఫీల్ కాకు… సినిమా నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తూ చేశాను… మళ్లీ నాతో ఎప్పుడు సినిమా చేయాలన్నా నేను రెడీగా ఉంటాను అని చెప్పిన విషయాన్ని తనతో ఎంతో భావోద్వేగానికిలోనై చెప్పారని రాజమౌళి చెప్పారు. రాజమౌళి – వినాయక్ మధ్య అంత మంచి బాండింగ్ ఉంది.