Moviesతార‌క్ సింగ‌ర్‌గా మారి పాట‌లు పాడిన సినిమాలు ఇవే..!

తార‌క్ సింగ‌ర్‌గా మారి పాట‌లు పాడిన సినిమాలు ఇవే..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలుగు సినిమా రంగంలో ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి అని చెప్పాలి. ఎన్టీఆర్ కేవలం నటుడు మాత్రమే కాదు… బడ్జెట్ ను కంట్రోల్ చేసే ఒక మంచి నిర్మాత కూడా ఎన్టీఆర్ లో దాగి ఉన్నాడు. తన సినిమాలకు ఒక్కోసారి బడ్జెట్ పెరగకుండా కంట్రోల్ చేస్తూ ఉంటాడు అని నిర్మాతలు సైతం అంటూ ఉంటారు. అలాగే కొన్ని సినిమాల్లో పాటలు పాడారు. ఎన్టీఆర్ పాడిన పాటలు మ్యూజికల్ గా సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఎన్టీఆర్ నటించిన సినిమాల్లో పాటలు పాడటంతో పాటు… ఇతర హీరోలు నటించిన సినిమాల్లో కూడా పాటలు పాడి తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు.

ఈ క్రమంలోనే ఆర్ఆర్ ఆర్ సినిమాలో కూడా ఎన్టీఆర్‌తో ఆ సినిమా సంగీత దర్శకుడు కీరవాణి ఒక పాట పాడించినట్టు తెలుస్తోంది. దీనిని ఇప్పటివరకు రాజమౌళి చాలా సీక్రెట్ గా ఉంచార‌ట‌. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుందని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ గతంలో తాను నటించిన యమదొంగ – కంత్రి – అదుర్స్ – ర‌భ‌స – నాన్నకు ప్రేమతో సినిమాల‌లో పాటలు పాడాడు.

రభసలో రాకాసి రాకాసి రబ్బరు బంతుల ఎగరేసి, నాన్నకు ప్రేమతో సినిమాలో ఫాలో ఫాలో యు ఇలాంటి సాంగ్స్ తెలుగు ప్రేక్షకులను ఒక ఊపు ఊపేశాయి. తెలుగులో మాత్రమే కాకుండా కన్నడంలో పునీత్ రాజ్ కుమార్ నటించిన సినిమాలో గెలయా గెలుపే నీద‌య్యా సాంగ్ పాడి కన్నడ ప్రేక్షకులను కూడా మై మరిపింప చేశాడు.

మ్యూజిక్ డైరెక్ట‌ర్ థ‌మ‌న్ కోరిక మేరకు పాట పాడిన ఎన్టీఆర్ .. ఇటీవ‌ల మృతి చెందిన క‌న్న‌డ ప‌వ‌ర్‌స్టార్ పునీత్ రాజ్ కుమార్ ను ఏకంగా మెస్మ‌రైజ్‌ చేసేసాడు. తెలుగుతో పాటు కన్నడంలోనూ మంచి సింగర్ అన్న గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ లోని సింగర్ టాలెంట్ తెలిసిన కీరవాణి ఇప్పుడు ప్రతిష్టాత్మకమైన ట్రిఫుల్ ఆర్‌ సినిమాలో కూడా ఒక పాట పాడిస్తున్నారట. అదే నిజమైతే సినిమాకు మరింత క్రేజ్, హైప్‌ రావడం ఖాయం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news