ప్రస్తుతం ఏ సినిమాలో నైన కామన్ గా కనిపించే పాయింట్ రొమాన్స్. అతి హద్దులు వరకు ఉంటే సరసం..అదే హద్దులు దాటితే దరిద్రంగా ఉంటుంది. ఒకప్పుడు సినిమాలో ముద్దు సీన్ వస్తేనే చూసేందుకు ప్రజలు ఇబ్బంది పడిపోయే వాళ్లు. కానీ ఇప్పుడు సినిమాలో బోల్డ్ సీన్లుంటే తప్పా ఆ సినిమా హిట్ అవ్వట్లేదు. తెర భార్య భర్తలు రూం లొకి వెల్లి తలుపు వేసుకుంటేనే ఏదో తప్పు చేసినట్లు చూసే జనం.. ఇప్పుడు జానడు బట్టలు వేసుకున్నా కూడా కథకు తగ్గట్లుగానే ఉంది అంటూ తమ తీరును మార్చుకుంటున్నారు.
ఇక డైరెక్టర్లు కూడా ప్రేక్షకుల తీరును బట్టే ఫాలో అవుతున్నారు. హీరోయిన్లు సైతం కథకు రొమాన్స్ అవసరమైతే కొద్దిగా ఘాటుగా నటించడానికి కూడా సై అంటున్నారు. రీసెంట్ గా కన్నడ స్టార్ హీరోయిన్ రచిత రామ్ తాను నటించిన సినిమాలో ఘాటు రొమాన్స్ పై కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆమె హీరోయిన్ గా నటించిన ‘లవ్ యూ రచ్చు’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఆమె రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది.
రిపోర్టర్ రచితను‘లవ్ యూ రచ్చు’ సినిమాలో కొద్దిగా ఘాటైన రొమాన్స్ చేసినట్టున్నారు.. అని అడగ్గా ఆమె కథ డిమాండ్ చేయడంతో తప్పలేదు అని ఆన్సర్ చెప్పింది. దానికి రిపోర్టర్ మళ్లి అంతకు ముందు ఇలాంటి బోల్డ్ సీన్స్ లో చేయను అని చెప్పారుగా.. మధ్యలో రచిత మాట్లాడుతూ ” పెళ్లి తరువాత ఎవరైనా ఏం చేస్తారు.. రొమాన్స్ కాకుండా ఇంకేమైనా చేస్తారా..? అని మొహానే చెప్పేసింది.
అసలు ఇలాంటి పాత్ర ఎందుకు చేయాల్సివచ్చింది అనేది తెలియాలంటే సినిమా చూడాలి” అని ఘాటుగా సమాధానం చెప్పింది. స్యాండిల్ వుడ్ (కన్నడ సినిమా)లో అజయ్ రావ్, రుచితా రామ్ కు మంచి క్రేజ్ ఉంది. అజయ్ రావ్, రుచితా రామ్ హీరో హీరోయిన్లుగా ఐలవ్ యూ రచ్చు అనే సినిమా నిర్మిస్తున్నారు. ప్రమఖ నిర్మాత గురు దేశ్ పాండే ఐ లవ్ యూ రచ్చు సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు శంకర్ రాజ్ అనే కొత్త డైరెక్టర్ దర్శకత్వం వహిస్తున్నారు.