సినిమా ఇండస్ట్రీ అంటేనే వాడుకోవడం.. అవసరాల కోసం ఎవరితో అయినా కమిట్ కావడం. ఈ కమిట్మెంట్ అనేది ఆడవాళ్ల విషయంలోనూ మనకు ఎక్కువుగా వినిపిస్తూ ఉంటుంది. ఈ కాస్టింగ్ కౌచ్ పదంతో ఎక్కువుగా పాపులర్ అయ్యింది సింగర్ చిన్మయి. చిన్మయి కాస్టింగ్ కౌచ్ పదాన్ని ఎక్కువుగా పాపులర్ చేస్తూ తాను ఇండస్ట్రీలో ఎవరి వల్ల లైంగీక వేధింపులు ఎదుర్కొన్నానో చెప్పింది.
సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఎవరినో ఒకరిని టార్గెట్ చేస్తూ వారి బండారం బయట పెడుతోన్న చిన్మయి తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ లో ఓ కామాంధుడి గురించి ఓ పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ కామాంధుడు తన ఫ్రెండ్‌తో చేసిన చాటింగ్‌తో పాటు ఆమెతో పెట్టిన ముచ్చట్ల గురించి చిన్మయి తన పోస్ట్‌లో రాసుకు వచ్చింది.
ఒక వ్యక్తికి 14 ఏళ్ల వయస్సు ఉన్నప్పటి నుంచే అమ్మాయిల వక్షోజాల మీద కన్ను పడింది అట. వాటిని తాకడం, పట్టుకోవడం అంటే ఆ వ్యక్తికి మహా ఇష్టం అట. రద్దీగా ఉన్న ప్రాంతాల్లో అందమైన అమ్మాయిలు ఎవరైనా ఉంటే వారి వక్షోజాలను తాకేవాడట. ఇందులో ఆ వ్యక్తి చాలా ఎక్స్పర్ట్ అట. ఇవన్నీ చెపుతూ సదరు వ్యక్తి తన ఫ్రెండ్‌తో చేసిన చాటింగ్‌లో తనను తాను గొప్పవాడిగా చెప్పుకు వచ్చాడట.
ఆ వయస్సులో అదో సరదా అని.. ఈ విషయంలో తన గ్యాంగులో తానే గ్రేట్.. ఎక్కువ మందివి పట్టుకున్నాను అని చాట్ చేశాడట. ఈ చాటింగ్ గురించి చెప్పిన చిన్మయి ఇలాంటి వాళ్లు కూడా సమాజంలో ఉన్నారు చూడండి.. అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. సరదా కోసం ఎవరైనా ఇలాంటి పనులు చేస్తారా ? అని ఆమె మండిపడింది.
This was shared on Instagram yesterday. Do read. And remain aware.
Some of the ‘accidental’ groping us women go through isn’t accidental at all. We are part of some sort of a competition for *some* of these guys who brag about it. 1/2 pic.twitter.com/4twO6Z73dM
— Chinmayi Sripaada (@Chinmayi) October 31, 2021