కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ 46 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో మరణించడం అందరిని కలచి వేస్తుంది. అక్టోబర్ 29 ఉదయం ఇంట్లో జిమ్ చేస్తుండగా ఆయనకు గుండె పోటురావడంతో… కుటుంబ సభ్యులు హుటాహుటిన బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించారు. అయినా పరిస్థితి విషమించడంతో.. హాస్పిటల్ లోనేచికిత్స పొందుతూ కన్నుమూశారు . పునీత్ రాజ్ కుమార్., మరణ వార్త కెవలం సినీ ఇండస్ట్రీ వాళ్లనే కాదు..సామాన్య ప్రజలను సైతం కంటతడి పెట్టిస్తుంది. ఇక పునీత్ హఠాన్మరణంతో సినీ లవర్స్ శోకసంద్రంలో మునిగిపోయింది.
పునీత్ మరణ వార్త విని అన్నీ ఇండస్ట్రీల స్టార్ ఆయనకు నివాళ్లు అర్పించారు. పునీత్‌కు కన్నడ ఇండస్ట్రీతోపాటు అన్నీ ఇండస్ట్రీలోనూ మంచు స్నేహితులు ఉన్న విషయం తెలిసిందే. ఇక పునిత్ రాజ్ కుమార్ అంత్యక్రియలకు టాలీవుడ్ నుండి చాలా మంది సెల బ్రిటీస్ హాజరు అయ్యారు. ఆయన్ని కడసారి చూసుకుని..మీడియా ముందే వెక్కి వెక్కి ఏడ్చారు. అయితే, ఇక్కడ షాకింగ్ విషయం ఎమిటంటే.. తమిళ ఇండస్ట్రీని నుండి ఒక్కరు అంటే ఒక్క హీరో కూడా పునిత్ అంత్యక్రియలకు రాకపోవడం గమనార్హం. ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ అయింది.
అయితే, పునీత్ తమిళ స్టార్ల పట్ల కూడా తన అభిమానాన్ని చాటుకున్న ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. అతడికి చాలామంది తమిళ హీరోలతో అనుబంధం కూడా ఉంది. కానీ ఎవరు కూడా పునీత్ ని కడసారి చూడటానికి కూడా బెంగళూరుకు రాలేదు.దీంతో తెలుగు స్టార్లు పునీత్ కడసారి చూపుకి వచ్చిన దృశ్యాలను షేర్ చేస్తూ తమిళ హీరోలు ఎక్కడ అని ప్రశ్నిస్తూ పునీత్ అభిమానులు వారిపై విరుచుకుపడుతున్నారు. అయితే దీనికి కారణం కావేరీ జలాల సమస్య అని తెలుస్తోంది. కర్ణాటక, తమిళనాడు మధ్య ఎన్నో సంవత్సరాలుగా కావేరీ జలాల సమస్య నడుస్తోన్న విషయం తెలిసిందే.
ఈ వివాదం తో తమిళ సినిమాలను కర్ణాటకలో విడుదల చేయకూడదని కూడా అప్పట్లో కన్నడ స్టార్ హీరోలు కూడా రోడ్డెక్కారట. ఇక ఇలాంటి సమయంలో పునీత్ అంత్యక్రియలకు హాజరైతే..ఎవైనా రాజకీయంగా సమస్యలు వస్తాయి అనుకొనే కోలీవుడ్ హీరోలు ఎవరూ రాలేదని సోషల్ మీడయాలో ప్రచారం జరుగుతుంది. మరో వైపు పునిత్ అభిమానులు తమిళ హీరోల సినిమాలను ఇకపై బాయ్‌కాట్ చేయాలని పిలుపునిస్తున్నారు.