Moviesఓ పెద్ద స్టార్ హీరో అయ్యుండి ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకున్నావు...

ఓ పెద్ద స్టార్ హీరో అయ్యుండి ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకున్నావు సూర్య..?

సూర్య..ఇది ఓ పేరు కాదు,,బ్రాండ్..కోలీవుడ్ ని శాసిస్తున్న స్టార్ హీరోల్లో ఈయన ఒక్కరు. వర్షటైల్ యాక్టర్ అయిన సూర్య. తమిళ సినిమా పరిశ్రమలో టాప్ హీరో అని అందరికి తెలిసిన విషయమే. ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాల్లో నటించి గొప్ప యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరో సూర్య కొద్ది కాలంలోనే మంచి హీరోగా మంచి గుర్తింపు సాధించాడు. ఆయన నటించే విభిన్నమైన సినిమాలు సూర్యకు కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ అభిమానులను సంపాదించి పెట్టాయి. కమర్షియల్ మాత్రమే కాకుండా సామజిక అంశాలను ఆయన సినిమాల్లో టచ్ చేస్తూ ఎందరో అభిమానుల మనసులు గెలుచుకుంటున్నారు.

వరుసుగా తన సినిమాలను ఓటీటీ లో రిలీజ్ చేస్తున్న సూర్య..తాజాగా తాను నటించిన 40వ సినిమాగా రూపొందుతున్న ‘జై భీమ్’ చిత్రంను కూడా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేయనున్నారు. దీంతో త‌మిళ‌నాడు థియేట‌ర్ల సంఘం తీవ్రంగా వ్య‌తిరేకిస్తుంది. సూర్య చేసే ప‌నుల‌తో థియేట‌ర్ల వ్య‌వ‌స్థ నాశ‌న‌మైపోతుందంటూ కోపంతో ఊగిపోతుంది త‌మిళ‌నాడు థియేట‌ర్స్ యూనియ‌న్‌. ఇలా సూర్య తన సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేస్తే.. ఇక పై ఆయన సినిమాల‌ను థియేట‌ర్‌లో విడుద‌ల కానివ్వ‌మ‌ని తీర్మానం చేశారు. కానీ సూర్య మాత్రం ఏం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూపోతున్నాడు.

త‌న సొంత నిర్మాణ సంస్థ 2డీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై తెర‌కెక్కిన‌ నాలుగు సినిమాల‌ను వ‌రుస‌గా అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌కు అమ్మేశాడు. దీంతో సూర్య తీసుకున్న ఈ నిర్ణ‌యంపై థియేట‌ర్ల యాజ‌మాన్యం మండిపడిఉతున్నారు.ఒక స్టార్ హీరో అయ్యుండి ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటారంటూ మండిప‌డుతున్నారు. ఏదేమైనా ఒకేసారి నాలుగు సినిమాల‌ను ఓటీటీలో విడుద‌ల చేయ‌డం ఒక సంచ‌న‌ల‌నం. జై భీమ్ సినిమా దీపావళీ సందర్భంగా నవంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ ప్రైమ్‌ లో స్ట్రీమింగ్ కానుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news