ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా.. కుల, మత , వర్గ భేదాలు లేకుండా మనసుకు నచ్చిన వారిని వివాహం చేసుకుంటున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్లను మొదలుకొని ప్రముఖ స్టార్ సింగర్స్ వరకు ఇలా చాలామంది కేవలం మనసుకు నచ్చిన వారిని మాత్రమే వివాహం చేసుకుంటున్నారు. ఇకపోతే తాజాగా సూపర్ సింగర్ గా గుర్తింపు తెచ్చుకున్న మాళవిక సుందర్ కూడా తనకంటే వయసులో చిన్న వారిని వివాహం చేసుకుంది. మాళవిక సుందర్ తెలుగు , తమిళ భాషలలో దాదాపు గా కొన్ని పదుల సంఖ్యలో సినిమాలకు పాటలు పాడే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది.
ఈమె తమిళ సూపర్ సింగర్ షో లో ప్లే బ్యాక్ సింగర్ గా పాల్గొని , ఈ కార్యక్రమం ద్వారా తనేంటో నిరూపించుకుంది. తెలుగులో 200కు పైగా పాటలు పాడి విశేష తెలుగు ప్రేక్షకాదరణ సంపాదించుకుంది.. ఇకపోతే ప్లేబ్యాక్ సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మాళవిక సుందర్ వయస్సులో తన కంటే చిన్నవాడైన ఎంటర్ప్రెన్యూర్ అశ్విన్ కశ్యప్ రఘురామన్ తో ఏడు అడుగులు వేసింది. గత కొన్ని నెలల నుంచి ప్రేమలో ఉన్న వీరిద్దరూ ఒక్కసారిగా పెళ్లి చేసుకోబోతున్నాం అని, కానీ తన కంటే వయసులో చిన్నవాడిని పెళ్లి చేసుకోబోతున్నారని మాళవిక తెలిపింది.
ఇకపోతే తాజాగా ఆ వ్యక్తితో కలిసి ఆమె ఏడు అడుగులు వేసింది. ఎంతో ఘనంగా సాంప్రదాయబద్ధంగా వీరి వివాహం జరిగింది. ఈ క్రమంలోనే వీరి పెళ్లికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడం అవి కాస్త వైరల్ గా మారడంతో పాటు ఎంతోమంది అభిమానులు ఈమెకు పెళ్లి శుభాకాంక్షలు కూడా చెబుతున్నారు. మాళవిక తన పెళ్లి విషయం గురించి మాట్లాడుతూ.. తన కంటే వయసులో చిన్నవాడిని పెళ్లి చేసుకున్నా.. వయసుతో పెళ్లికి ఏమాత్రం సంబంధం లేదు.. కేవలం ఒకరికొకరు అర్థం చేసుకొని.. ఒకరిపై ఒకరు గౌరవం పెంచుకుంటే వయసుతో పెళ్లికి ఏమాత్రం సంబంధం ఉండదు అంటూ ఆమె తెలిపింది.. ఏదిఏమైనా తాను ఎంతగానో ప్రేమించిన వారిని వివాహం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది అంటూ కూడా తెలిపింది.