Moviesశోభన్ బాబు వద్దన్నాడు.. కానీ వెంకీ చేసి చూపించాడు..!!

శోభన్ బాబు వద్దన్నాడు.. కానీ వెంకీ చేసి చూపించాడు..!!

ఆంధ్ర సోగ్గాడుగా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు శోభన్ బాబు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రాలకి పరిమితమవుతూ.. ప్రేక్షకులలో మంచి ఆదరణ పొందారు. ఇకపోతే విక్టరీ వెంకటేష్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు..ఆయన తన సినీ కెరీర్లో ఎన్నో బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. అలాంటి సినిమాలలో శత్రువు సినిమా కూడా ఒకటి. ఈ సినిమాకు ముందు వెంకటేష్ నటించిన కొన్ని సినిమాలు బాక్సాఫీసు వద్ద ఆశించిన స్థాయిలో విజయాలను అందివ్వలేదు. ఆంధ్ర సోగ్గాడు ఈ సినిమాలో నటించాల్సి ఉండగా కానీ ఆయనకు ఎందుకో రిజెక్ట్ చేయడంతో ఈ సినిమా కాస్త వెంకటేష్ వద్దకు చేరుకుంది.

ఈ సినిమాను వెంకటేష్ ఓకే చేయడానికి, శోభన్ బాబు రిజెక్ట్ చేయడానికి కూడా కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయట. అయితే ఈ విషయాలను టాలీవుడ్ నిర్మాత ఎమ్మెస్ రాజు వివరించారు. ఈయనకు తొలి చిత్రం కూడా ఇదే కావడం గమనార్హం.. ఎమ్మెస్ రాజు రాసిన కథలో శోభన్ బాబు నటిస్తే బాగుంటుందని అనుకున్నారట.. అయితే కథ నచ్చినా, ఆ సినిమాలో నటించడం తనకు ఇష్టం లేదని శోభన్ బాబు ఎమ్. యస్. రాజు తో చెప్పారు.. నిర్మాత కావాలనే తన కోరికను శోభన్ బాబు సమర్ధించ లేదట.. సినిమాల కు బదులుగా ఏదైనా బిజినెస్ చేసుకోమని సలహా ఇచ్చారట..శత్రువు సినిమా సక్సెస్ సాధించకపోతే మనస్పర్ధలు వస్తాయని , అందుకే తాను నటించనని కూడా చెప్పాడట.. దీంతో వెంకటేష్ ను ఒప్పించి ఆ సినిమాలో నటించేలా చేశారు.

కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు, రాజ్ కోటి సంగీతాన్ని అందించారు. శోభన్ బాబు రిజెక్ట్ చేసిన ఈ సినిమా ను వెంకటేష్ చేసి సక్సెస్ సాధించాడు.ఇక ఎమ్.ఎస్. రాజు నిర్మాతగా కూడా తన కెరీర్ మొదలు పెట్టారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news