తెలుగు సినిమా రంగంలో 1980వ దశకం నుంచి నేటి తరం వరకు ఎంతో మంది హీరోయిన్లు వస్తున్నారు.. వెళుతున్నారు. ఎంతమంది వచ్చినా లేడీ సూపర్ స్టార్ విజయశాంతికి ఏ రంగంలో అయినా సాటిరాగల హీరోయిన్లు ఎవరు లేరు. విజయశాంతి కేవలం సినిమా రంగంలో మాత్రమే కాదు… సామాజిక రంగంలోనూ, రాజకీయ రంగంలోనూ ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువు అయ్యారు. మూడున్నర దశాబ్దాల సినిమా కెరీర్లో విజయశాంతి 180కి పైగా సినిమాల్లో నటించారు.
ఈ సినిమాల్లో చాలా వరకు సూపర్ డూపర్ హిట్లు ఉన్నాయి. ఎన్నో నంది అవార్డులు, ఫిల్మ్ ఫేర్ అవార్డులు విజయశాంతి సొంతం అయ్యాయి. ఇదిలా ఉంటే రాశీ మూవీస్ అధినేత నరసింహారావు శోభన్ బాబు తో ఒక సినిమా చేయాలని అనుకున్నారట. కొన్ని రోజుల తర్వాత శోభన్‌బాబు ఎక్కువ రెమ్యూనరేషన్ అడగగా నరసింహారావు 50, 000 అడ్వాన్స్ ఇచ్చి మరి శోభన్ బాబు డేట్లు బుక్ చేశారట. కోదండరామి రెడ్డి డైరెక్షన్లో బావమరదళ్ళు సినిమా ప్రారంభించారట.
ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ రాధిక కాగా… మరో హీరోయిన్ గా విజయశాంతిని తీసుకోవాలని అనుకున్నారట. అయితే శోభన్ బాబు విజయశాంతితో నటించనని చెప్పేశారట. విజయశాంతి వయసులో చిన్న అమ్మాయి అని… ఆమె తన కూతురు, చెల్లెలి పాత్రలో నటించిందని… అలాంటి అమ్మాయితో తాను హీరోయిన్ గా నటించనని చెప్పారట.
అయితే శోభన్‌బాబు విజయశాంతితో చేయనని చెప్పడంతో… సుహాసినిని ఆ సినిమాలో మరో హీరోయిన్ గా తీసుకున్నారట. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. తర్వాత 100 రోజుల ఫంక్షన్ లో కూడా తన గురించి శోభన్ బాబు చాలా బాగా మాట్లాడారు అని.. నరసింహారావు ఆయనపై ప్రశంసలు కురిపించారు.