Moviesరెండు నెల‌లు నిషేధానికి గురైన ఎన్టీఆర్ సినిమా.. ఏం జ‌రిగింది...!

రెండు నెల‌లు నిషేధానికి గురైన ఎన్టీఆర్ సినిమా.. ఏం జ‌రిగింది…!

ఏ సినిమా అయినా రిలీజ్ అవ్వాలంటే ముందు సెన్సార్ కావాలి. సెన్సార్ సభ్యులకు సినిమాలో ఏవైనా తేడాలు ఉన్నట్టు అనిపిస్తే ఖచ్చితంగా తాము అనుకున్న సర్టిఫికెట్ ఇస్తారు. లేదా కొన్ని సీన్లకు బిప్‌లు చెప్పడమో చేస్తూ ఉంటారు. ఇక సినిమా మరి ఘోరంగా ఉందని… సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని అనుకుంటే వారు ఆ సినిమాను నిషేధించాలని కూడా చెబుతారు.. లేదా కొన్ని సీన్లు మార్చి మళ్ళీ సెన్సార్ ముందుకు తీసుకు వస్తే… తాము సర్టిఫికెట్ ఇస్తామని చెబుతారు.

ఈ క్రమంలోనే సీనియర్ ఎన్టీఆర్ నటించిన ఒక సినిమా గతంలో రెండు నెలల పాటు నిషేధానికి గురైంది. ఇది అప్పట్లో ఓ సంచలనం అయింది. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నందమూరి కుటుంబానికి ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్టీఆర్ గతంలో స్టార్ హీరో గా ఉన్నప్పుడు వరుసపెట్టి సినిమాలు మీద సినిమాలు చేసుకుంటూ వచ్చారు. ఎన్టీఆర్ సినిమాలో నటించాడు అంటే ఆ సినిమా సూపర్ హిట్ అన్న టాక్ ఉండేది.

ఎన్టీఆర్‌ నటుడుగానే కాకుండా దర్శకుడిగా కూడా ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించారు. ఎన్టీఆర్ తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో కలిసి నటించారు. ఇక పౌరాణిక పాత్రల్లో నటించాలని అంటే నాటి నుంచి నేటి తరం వరకు ఎన్టీఆర్ కు సాటిరాగ‌ల హీరో లేరు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ స్వీయదర్శకత్వంలో రూపొందిన సినిమా తాతమ్మకల. ఈ సినిమా రిలీజ్ కు ముందు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. రిలీజ్ సమయంలో 1974 దేశం మొత్తం కుటుంబ నియంత్రణ గురించి జోరుగా చ‌ర్చ‌లు నడుస్తున్నాయి.

ఎవరు కూడా ఇద్దరు పిల్లలకు మించి ఎక్కువ మందిని కనకూడ‌దు అన్న‌ ప్రచారం ఊపందుకుంది. ఎన్టీఆర్ దీనికి పూర్తిగా విరుద్దం. ఈ నేపథ్యంలోనే ఒక సినిమాను తెరకెక్కించాలని అనుకున్న ఎన్టీఆర్ ఈ సినిమాలో తన వారసులను పరిచయం చేశారు. అలాగే భానుమ‌తి ఓ పాత్రలో నటించగా… ఎన్టీఆర్ కీలక పాత్రలో కనిపించారు. ఐదుగురు పిల్లలు… ఐదు ప్రధాన సమస్యలకు పరిష్కారాలుగా ఉంటారు.

ఈ సినిమాలో హరికృష్ణ వ్యసనపరుడుగా కనిపిస్తే… తాతమ్మ కోరిక తీర్చే పాత్ర‌లో బాలకృష్ణ నటించారు. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుంచి అభ్యంతరాలు వచ్చాయి. రెండు నెలల పాటు నిషేధించారు. ఈ సినిమాపై అసెంబ్లీలో చాలా చర్చలు జరిగాయి. చివరకు 1974 లో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి హిట్ అవ్వడంతో పాటు లాభాలు సాధించింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news