Moviesసమంతకి ఆ అర్హత ఉంది..గుణశేఖర్ షాకింగ్ కామెంట్స్..!!

సమంతకి ఆ అర్హత ఉంది..గుణశేఖర్ షాకింగ్ కామెంట్స్..!!

నాగచైతన్యతో విడాకుల తరువాత సమంత నాన్ స్టాప్ గా సినిమాలు చేసుకుంటూ పోతుంది. ఇప్పటికి మూడు బడా ప్రాజెక్ట్స్ కి సైన్ చేసిన సమంత..రీసెంట్ గా పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి కూడా రెడీ అయ్యింది ఈ విషయాని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. అయితే ఇప్పుడు సమంత ఖాతలో మరో సినిమా వచ్చి పడింది. అలాంటి ఇలాంటి సినిమా కాదు.. తొలి అంతర్జాతీయ ప్రాజెక్ట్‌కు సంతకం చేసింది సామ్‌.

ఒకవైపు సోషల్ మీడియాలో రక రకాల కామెంట్స్ పెడుతూ హాట్ టాపిక్ అవుతూనే సినిమాల పరంగా సడన్ సర్‌ప్రైజెస్ ఇచ్చి షాకిస్తోంది. ఇప్పటికే గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం అనే పౌరాణిక చిత్రాన్ని పూర్తి చేసింది. తాజాగా సమంతకు హాలీవుడ్ మూవీలో నటించే ఛాన్స్ వచ్చింది. అదే “అరేంజ్‌‌మెంట్స్ ఆఫ్ లవ్”. భారతీయ రచయిత ఎన్.మురారి రాసిన పుస్తకానికి నవలా రూపం ఈ చిత్రం. సమంతా తన తొలి అంతర్జాతీయ ప్రాజెక్ట్‌పై సంతకం చేసింది. ఆ శుభవార్తను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.

‘12 ఏళ్ల క్రితం ‘ఏమాయ చేశావె’ సినిమా కోసం ఆడిషన్‌లో పాల్గొన్నాను. మళ్లీ 12 సంవత్సరాల తర్వాత ఆడిషన్‌ ఇచ్చా. అప్పుడున్న నెర్వస్‌ ఫీలింగ్‌ ఇప్పుడు కూడా ఉంది. బాఫ్టా’ అవార్డ్‌ గ్రహీతతో పనిచేయడం ఆనందంగా ఉంది.’ రాసుకొచ్చింది. ‘డోంటన్ అబ్బే’ ఫేమ్‌ ఫిలిప్ జాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. అయితే ఈ చిత్రంలో సామ్‌ బై-సెక్సువల్‌ తమిళ అమ్మాయిగా కనిపించనున్నట్లు సమాచారం. హాలీవుడ్‌ చిత్రాలు సైన్‌ చేస్తుండటంతో సామ్‌పై పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా డైరెక్టర్‌ గుణశేఖర్‌ ట్వీట్‌ చేస్తూ.. ‘మీ డెడికేషన్‌కు ఇది తగిన ఫలితం. ఇంకా మరెన్నో చేయాలి’ అంటూ ఆమె శుభాకాంక్షలు తెలియజేసారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news