Moviesఅడ్డంగా దొరికిపోయిన బిగ్ బాస్ కంటెస్టెంట్ విశ్వ..ఏకిపారేస్తున్న నెటిజన్లు..!!

అడ్డంగా దొరికిపోయిన బిగ్ బాస్ కంటెస్టెంట్ విశ్వ..ఏకిపారేస్తున్న నెటిజన్లు..!!

రోజులు గడుస్తున్న కొద్ది బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ ల మధ్య హీట్ పెరిగిపోతుంది. ఈ సీజన్ కి లాస్ట్ కెప్టెన్ గా హౌస్ మేట్స్ షణ్ముఖ్ ని ఎన్నుకున్నారు. ఇక టాప్ 5 లో ఉండేందుకు అందరు కంటెస్టెంట్ లు ఎవ్వరికి తగ్గ ప్లాన్ లు వాళ్లు వేసుకుంటున్నారు. ఎలాగైన టైటిల్ గెలవాలని సన్నీ బాగా కష్ట పడుతున్నాడు. ఇక బయట టాక్ కూడా అలానే ఉంది. షణ్ముఖ్ కి బయట ఫాలోయింగ్ ఉన్నా కానీ సిరి తో ఆయన బిహేవ్ చేసే పద్దతి బాగాలేకపోవడం వల్ల..ఆయన మీద నెటిజన్స్ కొంతమేరా అసహనం గా ఉన్నట్లు తెలుస్తుంది.


కాగా బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యి హౌస్ లో నుండి బయటకు వచ్చేసిన విశ్వ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారాడు. అసలు ఏమైందంటే.. తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్ విశ్వ ఈ లగ్జరీ కారు కొన్నాడు. కారు అంటే అలాంటి ఇలాంతి కారు కాదండోయ్ ఏకంగా లక్షలు విలువ చేసే బీఎండబ్ల్యూ కారును తన సొంతం చేసుకున్నాడు. మనం కలలు కన్న కారును కొంటే ఎంత సంతోషంగా ఉంటుందో చెప్పలేం. ఇప్పుడు నేను అదే ఫీలింగ్‌లో ఉన్నా.. మా కుటుంబంలోకి కొత్త మెంబర్ వచ్చింది.. దీనంతటికి కారణం ఆ దేవుడు, బిగ్ బాస్ అంటూ విశ్వ ఎమోషనల్ అయ్యాడు.

ఇక ఈ శుభవార్తను ఆయన సోషల్‌ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకున్నాడు. ఇక అక్కడే ఆయన అడ్డంగా దొరికిపోయారు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు ఆయన చెప్పిన డైలాగ్స్ ను గుర్తు చేస్తున్నారు.లాక్‌డౌన్‌లో కూతురు చదువు ఫీజు కట్టడానికి కూడా డబ్బుల్లేవని ..బిగ్ బాస్ హౌస్ లో ఏడ్చాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు బీఎండబ్ల్యూ కారును కొనడం చర్చనియాంశం అయ్యింది. కొందరు నెటిజన్స్ బిగ్‌బాస్‌తో విశ్వ రేంజ్‌ మారిపోయిందని అంటుంటే… మరికొంతమంది మాత్రం షోలో స్కూలు ఫీజుకు కూడా డబ్బుల్లేవని చెప్పి..ఇప్పుడు బయటకు వచ్చాక బీఎండబ్ల్యూ కారును కొనుకోవడం ఏంటని అని సెటైర్లు వేస్తున్నారు. ఇక ఆయన తన కొత్త కారు తో దిగ్గిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 

 

View this post on Instagram

 

A post shared by Actor Vishwa (@actorvishwaa_official)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news