Newsమీడియాకి క్ష‌మాప‌ణ‌లు తెలిపిన రాజ‌మౌళి.. అసలు ఏమైందంటే..!

మీడియాకి క్ష‌మాప‌ణ‌లు తెలిపిన రాజ‌మౌళి.. అసలు ఏమైందంటే..!

దర్శక ధీరుడు రాజమౌళి దాదాపు మూడు సంవత్సరాలు కష్టపడి 450 కోట్ల భారీ బడ్జేట్ తో తెరకెక్కించిన చిత్రమే ” రణం రౌద్రం రుధిరం”. కోట్లాది మంది అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురుచూస్తున్న ఈ సినిమా జనవరి 7న గ్రాండ్ గా ధియేటర్స్ లో రిలీజ్ కానుంది. పీరియాడిక్ మల్టీ-స్టారర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా లో మెగా పవర్ స్టార్ రాం చరణ్, నందమూరి వారసుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మాగ్నమ్ ఓపస్ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్స్ పనులని వేగంవమతం చేసారు.

సినిమాని తెరకెక్కించడంలోనే కాదు ఆ సినిమా ప్రమోషన్స్ చేసుకోవడం లోను రాజమౌళి నెం 1 గానే కనిపిస్తున్నారు. పాన్ ఇండియా వైడ్ లో ఈ సినిమాని రిలీజ్ చేస్తుండటంతో అన్ని భాషల్లో ఈ సినిమాని బాగా ప్రమోట్ చేస్తున్నారు. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళంతో సహ అనేక బాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. జక్కన్న దగ్గరుండి మరీ ఈ ప్రమోషన్స్ చేయిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన అన్నీ పాటలు అభిమానులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యం గా “నాటు నాటు” పాట అయితే మాస్ అభిమానులను బాగా అట్రాక్ట్ చేస్తుంది. చరణ్ , తారక్ మాస్ స్టెప్పులు ఈ పాటకి పెద్ద ప్లస్ గా మారాయి.

బెంగళూరులోని యశవంతపురంలోని ఓరియన్ మాల్ లో ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్ లో భాగంగా జనని కన్నడ పాటను ఎస్ఎస్ రాజమౌళి విడుదల చేశారు. ఈ సందర్బంగా కన్నడలోనే మాట్లాడిన ఎస్ఎస్ రాజమౌళి కన్నడ బాష మీద అభిమానాన్ని మరోసారి గుర్తు చేసుకున్నారు. ఇక చెన్నై లో జనని తమిళ వెర్షన్‌ను రాజమౌళి, చిత్ర నిర్మాత డివివి దానయ్య.. విడుదల చేశారు. కాగా “ఆర్ఆర్ఆర్”ను సమర్పిస్తున్న బ్యానర్ అయిన లైకా ప్రొడక్షన్స్ అధికారులు ఈ పాట లాంచింగ్ ఈవెంట్ కు హాజరయ్యారు.

చెన్నై లో జరిగిన ‘జనని’ తమిళ వెర్షన్ ‘ఉయిరే’ లాంచ్ ఈవెంట్‌ లో రాజమౌళి కోలీవుడ్ సినీ మీడియా సోదరులకు సారీ చెప్పారు. ఈ కార్యక్రమంలో రాజమౌళి మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా తమతో ఇంటరాక్ట్ కానందుకు తమిళ సినీ మీడియా సోదరులకు మొదట క్షమాపణలు చెప్పారు. జనవరిలో సినిమా విడుదలకు ముందు జరిగే గ్రాండ్ ప్రమోషనల్ ఈవెంట్‌లో తప్పకుండా వారితో సంభాషిస్తానని రాజమౌళి వారికి హామీ ఇచ్చారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news