Moviesప్రభాస్ లవ్ ఆంథెమ్..డార్లింగ్ సూపరహే..!!

ప్రభాస్ లవ్ ఆంథెమ్..డార్లింగ్ సూపరహే..!!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా తరువాత అన్నీ బడా బడ్జెట్ మూవీలే చేస్తున్నారు. బాహుబలి సినిమాతో ఆయన రేంజ్ మారిపోయిందనే చెప్పాలి. ఆయన రేంజ్ తో పాటు రెమ్యూనరేషన్ ని కూడా పెంచుకుంటూ పోయాడు ఈ ఆరు అడుగుల అందగాడు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీ బిజీ గా ఉన్న ఈ హీరో పెళ్ళి ఎప్పుడా అంటే మాత్రం మాట దాటేస్తున్నాడు. ఇక ప్రభాస్ పూజా హెగ్డే హీరో హీరోయిన్ లు గా నటించిన రొమాంటిక్ చిత్రం “రాధే శ్యామ్”. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కుతుంది. ఫాంటసీ ఎలిమెంట్స్‌తో పీరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.

‘రాధే శ్యామ్’ సినిమాని యూవీ క్రియేషన్స్ – గోపీకృష్ణ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇటలీ బ్యాక్ డ్రాప్ లో 70ల కాలం నాటి ప్రేమకథతో ఈ సినిమా రూపొందుతోంది. ప్రభాస్ ఇందులో విక్రమాదిత్య అనే హస్తసాముద్రికా నిపుణుడిగా కనిపిస్తుండగా.. ఆయన ప్రేయసి ప్రేరణగా పూజా హెగ్డే అలరించనుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన అన్నీ అప్డేట్స్ ఈ సినిమాపై ఆసక్తిని పెంచేశారు. ప్రభాస్ అభిమానులు అయితే ఈ సినిమాని ఎప్పుడెప్పుడు తెర పై చూద్దామా అని ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. ఈ మధ్యనే రిలీజ్ అయిన “ఈ రాతలే” పాట ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ నేపథ్యంలో ‘రాధే శ్యామ్’ మేకర్స్ మరో పాటను రిలీజ్ చేయడానికి సిద్ధమైయారు. ఇప్పుడు ఈ సినిమా నుండి మరో సింగిల్‌ని విడుదల చేయడానికి చిత్ర బృందం ముహూర్తం ఫిస్ చేసారు.

వన్ హార్ట్ టూ హార్ట్ బీట్స్ సాంగ్ లాంచ్‌కు ముందు ఆ పాట టీజర్ ని రేపు విడుదల చేయనున్నారు చిత్ర బృందం. ఈ మేరకు పోస్టర్ కూడా విడుదల చేసింది. ‘రాధేశ్యామ్’ లవ్ ఆంథెమ్ సెకండ్ సాంగ్ హిందీ టీజర్‌ని మధ్యాహ్నం 1 గంటలకు లాంచ్ చేయనుండగా, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ వెర్షన్‌లను రాత్రి 7 గంటలకు లాంచ్ చేయనున్నారు. ఈ సినిమాకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించగా, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం ‘రాధే శ్యామ్’ జనవరి 14, 2022న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news