Moviesభ‌ద్ర సినిమా ఎందుకు మిస్ అయ్యానో చెప్పిన బ‌న్నీ...!

భ‌ద్ర సినిమా ఎందుకు మిస్ అయ్యానో చెప్పిన బ‌న్నీ…!

అఖండ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వ‌చ్చిన అల్లు అర్జున్ ఆ వేదిక‌పై అదిరిపోయే స్పీచ్ అయ్యారు. బ‌న్నీ ఇచ్చిన స్పీచ్ నంద‌మూరి అభిమానుల‌ను మామూలుగా ఖుషీ చేయ‌లేద‌నే చెప్పాలి. నంద‌మూరి ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీకి ఉన్న క‌నెక్ష‌న్ ఈనాటిది కాదు.. రామారావు గారు, మా తాత‌య్య గారు అల్లు రామ‌లింగ‌య్య గారి కాలం నుంచే ఈ అనుబంధం ఉంద‌ని చెప్పారు.

తాను చిరంజీవిగారు, బాల‌కృష్ణ గారి సినిమాలు చూస్తూ పెరిగాన‌న‌ని.. అలాంటిది ఈ రోజు బాల‌కృష్ణ గారి సినిమా ఫంక్ష‌న్‌కు గెస్టుగా రావ‌డం ఆనందంగా ఉంద‌ని బ‌న్నీ చెప్పాడు. ఇక బోయ‌పాటి శ్రీను గారు ద‌ర్శ‌కుడు కాక‌ముందు నుంచే త‌న‌కు ఆయ‌న‌తో ఎంతో ప‌రిచ‌యం ఉంద‌ని.. ఆయ‌న భ‌ద్ర క‌థ చెప్పిన‌ప్పుడే ఆయ‌న ఎంతో పెద్ద గొప్ప డైరెక్ట‌ర్ అవుతాన‌ని తాను చెప్పిన‌ట్టు బ‌న్నీ గుర్తు చేసుకున్నారు.

ఇక భ‌ద్ర క‌థ ముందుగా త‌న‌కే చెప్పార‌ని.. అయితే తాను ఆర్య సినిమాకు క‌మిట్ అవ్వ‌డంతో భ‌ద్ర చేయ‌లేక‌పోయాన‌ని బ‌న్నీ చెప్పారు. అయితే ఆ లోటును స‌రైనోడు సినిమా తీర్చేసింద‌న్నాడు. ఆయ‌న అసిస్టెంట్ డైరెక్ట‌ర్ నుంచి డైరెక్ట‌ర్ అయ్యి.. ఈ రోజు స్టార్ డైరెక్ట‌ర్ అయ్యాడ‌ని ప్ర‌శంసించాడు. న‌న్ను బాగా ఇష్ట‌ప‌డే వారిలో బోయ‌పాటి గారు ఒక‌రు అని.. అలాగే తాను కూడా బోయ‌పాటి గారిని ఎంతో ఇష్ట‌ప‌డ‌తాను అని చెప్పారు.

Latest news