Moviesబాల‌య్య సినిమా టిక్కెట్ కోసం రెండు రోజులు జైళ్లో ఉన్న టాప్...

బాల‌య్య సినిమా టిక్కెట్ కోసం రెండు రోజులు జైళ్లో ఉన్న టాప్ డైరెక్ట‌ర్‌..!

యువరత్న నందమూరి బాలకృష్ణ సినిమా వస్తుంది అంటే బాక్సాఫీస్ దగ్గర సందడి ఎలా ? ఉంటుందో చెప్పక్కర్లేదు. బాలయ్య అభిమానులు అయితే ముందు రోజు నుంచే థియేటర్ల దగ్గర హడావిడి చేసేస్తారు. బాలయ్య సినిమా రిలీజ్ రోజు… ఆయన అభిమానులకు సంక్రాంతి పండగ వాతావరణమే ఉంటుంది. ఎలాగైనా ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ తెచ్చుకుని సినిమా చూసేయాల‌న్న ఆతృత అందరిలోనూ ఉంటుంది.

ఇక బాల‌య్య‌ సినిమా కోసం సెలబ్రిటీలు సైతం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న ఓ టాప్ డైరెక్టర్ బాలయ్య సినిమా టిక్కెట్‌ కోసం ట్రై చేసి… ఏకంగా రెండు రోజులు ఒంగోలు జైల్లో ఉన్నారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. అఖండ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో పాటు దర్శకుడు రాజమౌళి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ద‌ర్శ‌కుడు మ‌లినేని గోపీచంద్ కూడా హాజ‌ర‌య్యాడు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ బాల‌య్య తో త‌న‌కు ఉన్న అనుబంధం గురించి చెప్పారు. బాల‌య్య నెక్ట్స్ సినిమాకు మ‌లినేని గోపీచంద్ ద‌ర్శ‌కుడు. ఎన్బీకే అంటే ఓ వైబ్రేష‌న్ అని.. ఎన్డీకే అంటే ఓ ఎన‌ర్జీ.. ఓ విస్ఫోట‌నం అని మ‌లినేని బాల‌య్య‌ను ఆకాశానికి ఎత్తేశారు. తాను ఒక ద‌ర్శ‌కుడిగా ఈ వేడుక‌కు రాలేద‌ని.. ఓ అభిమానిగా వ‌చ్చాన‌ని చెప్పారు.

ఇక బాల‌య్య బాబుకు తాను పెద్ద ఫ్యాన్‌ను అని.. గ‌తంలో స‌మ‌ర‌సింహారెడ్డి సినిమా టిక్కెట్ల కోసం జ‌రిగిన ఫైట్లో తాను రెండు రోజుల పాటు ఒంగోలు జైల్లో ఉన్నాన‌ని నాటి సంఘ‌ట‌న‌ను ఆయ‌న గుర్తు చేసుకున్నారు. ఇక తాను కూడా అంద‌రిలాగానే డిసెంబ‌ర్ 2వ తేదీ కోసం వెయిట్ చేస్తున్న‌ట్టు చెప్పారు.

Latest news