యంగ్ టైగర్ ఎన్టీఆర్ 2015 కు ముందు వరకు కెరీర్ పరంగా వరుసగా ఎదురుదెబ్బలు తిన్నారు. ఎన్టీఆర్ కు టెంపర్ సినిమాకు ముందు వరకు సరైన హిట్ లేదు. ఊసరవెల్లి – రామయ్య వస్తావయ్య – శక్తి సినిమాలు పెద్ద డిజాస్టర్ అయ్యాయి. బృందావనం యావరేజ్‌గా నిలిచింది. టెంపర్ సినిమా నుంచి ఎన్టీఆర్ కెరీర్ ఊపందుకుంది. వరుసగా ఐదు సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఎన్టీఆర్ ఖాతాలో పడ్డాయి. టెంపర్ – నాన్నకు ప్రేమతో – జనతా గ్యారేజ్ – జై లవకుశ – అరవింద సమేత వీర రాఘవ లాంటి సినిమాలు ఎన్టీఆర్ ను శిఖరంపై కూర్చోబెట్టాయి.
అయితే టెంపర్ సినిమాకు ముందు ఎన్టీఆర్ ఒక సెంటిమెంట్ ను నమ్మి వరుస ఎదురు దెబ్బలతో కెరీర్ లో పాతాళానికి పడిపోయాడు. అంతకు ముందు ఒక ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన దర్శకుడిని గుడ్డిగా నమ్మేసి వాళ్ళతో వరసగా సినిమాలు చేసుకుంటూ వచ్చారు. దూకుడు లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత శ్రీను వైట్లతో బాద్ షా సినిమా చేశాడు. ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాలేదు.
గబ్బర్‌సింగ్ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత హరీష్ శంకర్ తో రామయ్యా వస్తావయ్యా సినిమా చేశాడు. ఆ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. కందిరీగ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన సంతోష్ శ్రీనివాస్‌తో రభస సినిమా చేస్తే ఆ సినిమా ఎన్టీఆర్ పరువు తీసేసింది. ఇలా వరుసగా అంతకుముందు సూపర్ హిట్లు ఇచ్చిన దర్శకులను గుడ్డిగా నమ్మేసి వాళ్లతో సినిమాలు చేస్తే అవి అనుకున్న ఫలితాలు ఇవ్వలేదు.
విచిత్రమేంటంటే అప్పటి నుంచి రూటు మార్చిన ఎన్టీఆర్ ప్లాపుల్లో ఉన్న దర్శకులు నమ్మి వరుసగా హిట్లు కొడుతూ వచ్చారు. వరస ఫ్లాపుల్లో ఉన్న పూరితో టెంపర్, వన్ సినిమా తర్వాత సుకుమార్ తో నాన్నకు ప్రేమతో, అజ్ఞాతవాసి లాంటి డిజాస్టర్ తర్వాత త్రివిక్రమ్ తో అరవింద సమేత సినిమాలు చేసి హిట్ కొట్టాడు. అలా ఎన్టీఆర్‌కు హిట్ దర్శకులు కాలిసి రాలేదు.. ప్లాప్ దర్శకులు బాగా కలిసి వచ్చారు.