సౌత్ ఇండియాలో లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న అందాల తార ఈ నయనతార. స్టార్ హీరోల సినిమానైనా సరే తనకు నచ్చితేనే ఆ సినిమాను కమిట్ అవుతుంది.నచ్చకపోతే రిజెక్ట్ చేసి పడేస్తుంది. ఏమాత్రం మొహమాటం లేకుండా మొహానే మాట్లాడే ఈ ఈ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అసలు లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు పెట్టింది పేరు నాయన తార . కేవలం తమిళ్ భాషలోనే కాదు..తెలుగులోను తనకంటూ ఓ మార్కేట్ క్రిYఏట్ చేసుకుంది. ప్రస్తుతం వరుసగా సినిమాలకు సైన్ చేస్తూ.. విజయాలు సాధిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న ఈ బ్యూటీ అందం ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేస్తుంది అనడంలొ ఏమాత్రం సందేహం లేదు.
కథలో కొత్తదనం ఉండే సినిమాలను ఎంపిక చేసుకుంటూ.. ఆచితూచి సినిమాలకు సైన్ చేస్తున్న నయన్.. మెగాస్టార్ చిరంజీవి సినిమాలో చెల్లెలుగా నటించడానికి సిద్దమైంది. మళయాలం లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన లూసిఫర్ సినిమాను మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ అనే పేరుతో తెలుగులోకి రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో ఒరిజినల్ వెర్షన్లో మంజు వారియర్ పోషించిన పాత్రలో..తెలుగులో నయనతార కనిపించనుంది. ఇప్పటికే నయనతార బర్త్ డే సందర్భంగా మేకర్స్ ఆమె లుక్‌ను విడుదల చేస్తూ శుభాకాంక్షలు కూడా తెలియజేశారు.
అయితే ఇపుడు నయనతార గాడ్ ఫాదర్ సినిమాకు తీసుకుంటున్న రెమ్యూనరేషన్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. నయన్ ఈ చిత్రానికి ఎవ్వరూ ఊహించని విధంగా రూ.6 కోట్లు రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట. ఇక్కడ షాకింగ్ ఏమిటంటే..తెలుగులో ఇప్పటివరకు ఏ హీరోయిన్ కూడా ఇంత భారీ రెమ్యూనరేషన్ తీసుకోలేదట. దీంతో నయనతార సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే హీరోయిన్లకు ఇస్తున్న పారితోషికంలో ఇదే అత్యధికం కావడం విశేషం. మరి చూడాలి నయన్ కు ఈ సినిమా ఎంత కలిసివస్తుందో..?