Moviesఐటమ్ సాంగ్ చేయడానికి సమంత పెట్టిన కండిషన్స్ వింటే..మైండ్ బ్లాకే..!!

ఐటమ్ సాంగ్ చేయడానికి సమంత పెట్టిన కండిషన్స్ వింటే..మైండ్ బ్లాకే..!!

సమంత-నాగచైతన్య.. ఏమైయా చేసావే సినిమా షూటింగ్ టైంలో ప్రేమ లో పడి..ఫైనల్ గా ఇంట్లో వాళ్ళను ఒప్పించి ఘనంగా పెళ్లి చేసుకున్నారు. కానీ అంతలోనే ఏం అయ్యిందో తెలియదు కానీ..ఇద్దరు విడిపోతున్నాం అంటూ ప్రకటించేసారు. వీళ్లు విడిపోవడానికి ఇదే కారణమటూ పూటకో వార్త సోషల్ మీడియాలొ వైరల్ అవుతుంది. ఇక ఈ విషయాలను పట్తించుకోని సమంత నాగచైతన్య విడాకుల తరువతా జివితానీ కొనసాగిస్తున్నారు.

నాగ చైతన్య పరిస్తిధి ఎలా ఉన్నా..విడాకుల తరువత సమంత మాత్రం జెట్ స్పీడ్ లో సినిమాలు చేసుకుంటూపోతుంది. వచ్చిన ఏ అవకాశాని వదులుకోకుండా..బడా ప్రాజెక్ట్స్ ని సైతం తన ఖాతాలో వేసుకుంటుంది. ఇప్పటికే నాలుగు బడా ప్రాజెక్ట్స్ కి సైన్ చేసిన ఈ కుందనపు బొమ్మ..రీసెంట్ గా అల్లు అర్జున్-సుకుమార కాంబినేషన్ లో వస్తున్న “పుష్ప” మూవీలో ఓ స్పెషల్ సాంగ్ చేసేందుకు పచ్చ జెండా ఊపింది. ఈ విషయమై పుష్ప టీం అధికారిక ప్రకటన కూడా ఇచ్చేసింది.

అయితే, సమంత ఈ సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి సుకుమార్ కు కొన్ని కండీషన్స్ పెట్టిందట. సుకుమార్ వాటికి ఒప్పుకుంటేనే ఆమె పుషప సినిమాలో ఈ ఐటెం సాంగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఇంతకి అమ్మడు పెట్టిన కండీషన్స్ ఏంటో తెలుసా..? సుకుమార్ సినిమాలో స్పెషల్ సాంగ్ అంటే ఓ రేంజ్ లో ఊహించుకుంటారు ఆయన ఫ్యాన్స్. అలానే ఈ సినిమా ఐటెం సాంగ్ కోసం ఓ భారీ సెట్ వెయ్యాలని డిసైడ్ అయ్యారట సుకుమార్. ఇదే విషయని సమంతకు చెప్పితే.. సమంత ఆ సెట్ ని రామోజీ ఫిలిం సిటీ లో వేయమని కండీషన్ పెట్టిందట.

అంతేకాదు ఈ సాంగ్ కి సంబంధించిన పనులు మొత్తం రామోజీ ఫిలిం సిటీ లోనే చేయాలని అలా అయితేనే ఆమె ఈ పాటలో చిందులు వెయ్యడానికి ఒప్పుకుంటానని చెప్పిన్నత్లు తెలుస్తుంది. అంతేనా ఈ సాంగ్ కు సంబంధించి సెట్ కానీ, లుక్స్ కానీ..షూటింగ్ జరిగే ఐదు ఆరు రోజులు చాలా గోప్యంగా ఉంచాలని కోరిందట . అంతేకాదు ఆ టైంలో అక్కడ నాగార్జున ఫ్యామిలీ ఎవరు షూటింగ్ కు రాకుండా ఉండేలా ప్లాన్ చేసుకోమన్నారట. ఈ కండీషన్స్ అన్నింటికి సుకుమార్ ఒకే చెప్పిన తరువాతనే ..సమంత ఈ సాంగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news