తెలుగు సినిమా చరిత్రను దేశవ్యాప్తంగానే కాకుండా ఎల్లలు దాటించిన ఘనత ఖచ్చితంగా దర్శకధీరుడు రాజమౌళికే దక్కుతుంది. దీంతో ఎటువంటి సందేహం లేదు. లెజండరీ దర్శకుడు కె. రాఘవేంద్రరావు శిష్యుడు అయిన రాజమౌళి బ్లాక్ బస్ట్ర సినిమాలు తీసి టాలీవుడ్ లో ఓ సరికొత్త చరిత్రను సృష్టించారు. ఆయన తీసిన మొదటి స్టూడెంట్ నెంబర్ వన్ నుంచి మొన్న వచ్చిన బాహుబలి – ది కంక్లూజన్ వరకు ఒక్క ప్లాప్ సినిమా లేకుండా అపజయం లేని దర్శకుడిగా దూసుకుపోతున్నాడు. బాహుబలి 1, 2 సినిమాల తర్వాత ఇప్పుడు రాజమౌళి ఇంటర్నేషనల్ దర్శకుడు అయిపోయాడు.
అయితే దర్శకధీరుడు రాజమౌళి ఇప్పుడు ఇండియన్ స్టార్ డైరెక్టర్ అయీపోయారు. కానీ ఇక్కడ చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే.. రాజమౌళి కూడా ఫ్లాప్ సినిమా ఎలా ఉంటుందో రుచి చూసాడు. బహుశా ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. ఆయన నటించిన ఓ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద అట్టర్ ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇంతకి ఆ సినిమా ఏంటో తెలుసా ..?..రెయిన్ బో..!!
ప్రముఖ దర్శకుడు వీ ఎన్ ఆదిత్య డైరెక్ట్ చేసిన రెయిన్ బో అనే సినిమాలో రాజమౌళి కూడా నటించారు. మొదట ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నా కానీ ఆశించినంత హిట్ అందుకోలేక పోయింది. దీంతో రాజమౌళి కెరీర్ లో మొదటి ఫ్లాప్ చిత్రంగా గుర్తుండిపోయింది. అంతేకాదు ఈ సినిమా తీసిన డైరెక్టర్ రెయిబో సినిమా ద్వారా డబ్బులు పొగొట్టుకున్నారు. నిజానికి ఈ సినిమాలో చేయడం రాజమౌళికి ఇష్టం లేదట. కానీ డైరెక్టర్ అడిగేసరికి కాదు అనలేక ఓ రోల్ చేసారట. కాగా రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 7వ తేదీన ఈ సినిమా థియేటర్లలోకి వస్తోంది. ఈ సినిమా గ్లింప్స్ ఇటీవలే రిలీజ్ అయ్యి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.