అక్కినేని నాగార్జునకు ఇటీవల వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేదు. పదేళ్లలో నాగ్ నుంచి వచ్చిన హిట్ సినిమా ఏదైనా ఉంది అంటే అది ఒక్క సోగ్గాడే చిన్ని నాయన మాత్రమే. ఈ సినిమాకు ప్రస్తుతం సీక్వెల్ గా బంగార్రాజు వస్తోంది. వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలని చూస్తున్నా.. సంక్రాంతికి పెద్ద సినిమాల పోటీ ఉండడంతో ఆ సాహసం చేసే పరిస్థితి లేదు.
పైగా ఈ సినిమాలో నాగ్‌తో పాటు నాగచైతన్య కూడా నటిస్తున్నాడు. నాగ్ – చైతు కాంబినేషన్ కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇటీవల రిలీజ్ అయిన టీజర్లు కూడా సినిమాపై ప్రామీసింగ్ అంచనాలు ఇస్తున్నాయి. ఇక హీరోయిన్లుగా కృతి శెట్టి, రమ్యకృష్ణ నటిస్తున్నారు. ఈ సినిమాలో స్వర్గ లోక సన్నివేశాలు ఉండడంతో భారీగా సెట్లు వేశారట. పైగా కరోనా కారణంతో సినిమా రెండు మూడు సార్లు వాయిదాలు కూడా పడింది.
దీంతో సినిమాకు అనుకున్న దానికంటే ఓవర్ బడ్జెట్ అయ్యిందని అంటున్నారు. ఇప్పటికే రు. 45 కోట్లు దాటిపోయిందని లెక్కలు వేస్తున్నారు. ఈ ఓవర్ బడ్జెట్‌తో అక్కినేని కాంపౌండ్‌లో టెన్షన్ కూడా మొదలైందని తెలుస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో జీ స్టూడియోస్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఓవర్ బడ్జెట్ కావడం… ఇటు నాగ్ సినిమాలకు ఇటీవల భారీగా మార్కెట్ పడిపోవడంతో ఆశించిన స్థాయిలో ప్రి రిలీజ్ బిజినెస్ కూడా జరగడం లేదని తెలుస్తోంది.
ఒకవేళ నాన్ థియేట్రికల్ రైట్స్ భారీ రేట్లకు అమ్ముడు అయితే మాత్రం సినిమా కొంత సేఫ్ జోన్‌లోకి వచ్చేసినట్లు అవుతుంది. మరో వైపు ట్రేడ్ వర్గాలు మాత్రం భారీ హిట్ సినిమాకు సీక్వెల్ కావడంతో ఏ మాత్రం హిట్ టాక్ వచ్చినా కూడా బ్రేక్ ఈవెన్ పెద్ద కష్టం కాదని అంటున్నారు. ఈ పరిణామాలతోనే నాగ్ బాగా టెన్షన్‌లో ఉన్నాడని అంటున్నారు. ఇక ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి ఈ సినిమాలో రాజకీయ నాయకురాలిగా కనిపించబోతోంది.