టాలీవుడ్‌లో యంగ్‌రెబల్ స్టార్ ప్రభాస్, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ఇద్దరూ ఇప్పుడు టాప్ హీరోలుగా కొనసాగుతున్నారు. వీరిద్దరు ఆరు నెలల గ్యాప్‌లోనే ఇండస్ట్రీలోకి హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. ప్రభాస్ 2002లో వచ్చిన ఈశ్వర్ సినిమాతో హీరో అయ్యాడు. ఇక అల్లు అర్జున్ కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన గంగోత్రి సినిమాతో హీరో అయ్యారు.
ఇదిలా ఉంటే ఈ ఇద్దరు హీరోలు నటించిన రెండు సినిమాలు ఒకే రోజు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డాయి. ఈశ్వర్ తర్వాత ప్రభాస్ నటించిన రాఘవేంద్ర, బన్నీ మొదటి సినిమా గంగోత్రి ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. 2003 మార్చి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాల్లో రాఘవేంద్రకు సురేష్ కృష్ణ దర్శకుడు. గంగోత్రికి రాఘవేంద్రరావు దర్శకుడు.
గంగోత్రిలో ఆర్తీ అగర్వాల్ చెల్లి అతిథి అగర్వాల్ హీరోయిన్. రాఘవేంద్రలో అన్షు ( మన్మథుడు ఫేం) హీరోయిన్‌గా నటించింది. మంత్రాలయం బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిందని ప్రచారం జరిగిన రాఘవేంద్రకు మంచి బిజినెస్ జరిగింది. అయితే కామెడీ ట్రాక్ బాగున్నా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది.
ఇక బన్నీ తొలి సినిమా గంగోత్రి సైలెంట్ టాక్‌తో స్టార్ట్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. గంగోత్రి పాటలు సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అవ్వడంలో కీలక పాత్ర పోషించాయి. పైగా ఈ సినిమాను అశ్వనీదత్ – అల్లు అరవింద్ కలిసి నిర్మించారు. బన్నీ కి తొలి సినిమాతోనే మంచి హిట్ వచ్చింది. ఇక రెండో సినిమా ఆర్య నుంచి బన్నీ వెనుదిరిగి చూసుకోలేదు.