Moviesద‌టీజ్ బాల‌య్య‌... అన్‌స్టాప‌బుల్ రికార్డ్‌

ద‌టీజ్ బాల‌య్య‌… అన్‌స్టాప‌బుల్ రికార్డ్‌

నంద‌మూరి బాల‌కృష్ణ త‌న కెరీర్‌లో మొద‌టి సారి హోస్ట్ చేసిన షో అన్‌స్టాప‌బుల్‌. అల్లు అర‌వింద్‌కు చెందిన ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ వేదిక‌గా ప్ర‌సారం అవుతోన్న ఈ షో ఇప్ప‌టికే రెండు ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్‌బాబు ఫ్యామిలీతో ఫ‌స్ట్ ఎపిసోడ్ పూర్తి చేసిన బాల‌య్య‌, నేచుర‌ల్ స్టార్ నానితో రెండో ఎపిసోడ్ చేశాడు. ఇక బ్ర‌హ్మానందంతో బాల‌య్య మూడో ఎపిసోడ్ ఉంటుంద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం బాల‌య్య చేతికి చిన్న శ‌స్త్ర‌చికిత్స జ‌ర‌గడంతో ఈ షోకు చిన్న విరామం వ‌చ్చింది.

ఈ షోతో బాల‌య్య వెండితెర ప్రేక్ష‌కుల‌తో పాటు బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు మ‌రికాస్త ద‌గ్గ‌ర‌య్యారు. ఈ షో అదిరిపోయే రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఆహా టాక్ షోల‌లోనే అత్య‌ధిక వ్యూస్ వ‌చ్చిన టాక్ షోగా అన్‌స్టాప‌బుల్ స‌రికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. అన్‌స్టాప‌బుల్ కు ఏకంగా 4 మిలియ‌న్ల వ్యూస్ వ‌చ్చాయి. ఇదే ఇప్పుడు టాప్ ప్లేసులో ఉంది.

ఆహా లో గ‌తంలో చాలా టాక్ షోలు వ‌చ్చాయి. గ‌తంలో ఆహా కోసం స‌మంత సామ్ జామ్ షో చేసింది. అయితే ఏ షోకు రాని క్రేజ్‌, వీక్ష‌కుల ఆద‌ర‌ణ అన్‌స్టాప‌బుల్‌కే వ‌చ్చింది. ఏదేమైనా బాల‌య్య స్టామినా వెండితెర‌తో పాటు బుల్లితెర మీద కూడా తిరుగులేద‌నే చెప్పాలి. ఇక బాల‌య్య మానియా కూడా ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ మ‌రింత మందికి ద‌గ్గ‌ర‌య్యేందుకు కార‌ణ‌మైంది.

ఆహా లో బాల‌య్య చేస్తోన్న టాక్ షోల దెబ్బ‌తో నంద‌మూరి అభిమానులు కూడా ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్‌కు స‌బ్‌స్క్రైబ‌ర్ల‌కుగా మారుతున్నారు. ఇక బాల‌య్య టాక్ షోకు త్వ‌ర‌లోనే స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కూడా గెస్టుగా వ‌స్తార‌ని తెలుస్తోంది. ఇటీవ‌ల అల్లు వారితో నంద‌మూరి బంధం బాగా పెన‌వేసుకుంటోన్న సంగ‌తి తెలిసిందే. బాల‌య్య న‌టించిన అఖండ డిసెంబ‌ర్ 2న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news