యువరత్న నందమూరి బాలకృష్ణ – మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ అఖండ. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సింహా, లెజెండ్ రెండూ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. దీంతో కచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని డిసెంబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అవుతోంది. శనివారం సాయంత్రం హైదరాబాద్ లో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా దర్శకధీరుడు రాజమౌళి, స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా అల్లు అర్జున్ అఖండ మాస్ జాతర పేరుతో అఖండ నుంచి రెండో ట్రైలర్ లాంచ్ చేశారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక రెండో ట్రైలర్ నందమూరి అభిమానులకు మాంచి యాక్షన్ ఫీస్ట్ ఇచ్చేసింది. బాలయ్య ఈ సినిమాలో రెండు పాత్రలను చేశారు.
ట్రైలర్ చూస్తుంటే యాక్షన్ ప్రియులకు మంచి బిర్యానీనీ బాలయ్య అందించబోతున్నారు అని అర్థమవుతోంది. బాలయ్య అఘోరగా చాలా పవర్ఫుల్ క్యారెక్టర్లో నటించాడని విజువల్స్ చెప్పేస్తున్నాయి.
నేనే త్రిపురనాశక రక్షకుడు.. శివుడు అంటూ అఘోర పాత్ర చెప్పిన డైలాగ్ మార్మోగిపోతోంది. యాక్షన్ సీక్వెన్స్ అయితే మరో లెవల్లో ఉన్నాయని తెలుస్తోంది. అలాగే మేం ఎక్కడికి అయినా వస్తే తల దించుకోం.. తెల తెంచుకుని వెళ్లిపోతాం అన్న డైలాగ్ అయితే పూనకాలు తెప్పిస్తోంది. ఇక దేవుణ్ణి కరుణించమని అడుగు.. కనిపించమని కాదు అంటూ చెప్పిన మరో డైలాగ్ కూడా అదరగొట్టేసింది.
ఇక థమన్ మ్యూజిక్‌తో పాటు సీ రామ్‌ప్రసాద్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఏదేమైనా అఖండ మాస్ జాతర మామూలుగా లేదని క్లారిటీ వచ్చేసింది. మరి అఖండ గర్జన ఎలా ఉండబోతోందో డిసెంబర్ 2న తేలిపోనుంది.