Movies' అఖండ ' ట్రైల‌ర్ చూసిన వెంట‌నే బ‌న్నీ ఎవ‌రికి ఫోన్...

‘ అఖండ ‘ ట్రైల‌ర్ చూసిన వెంట‌నే బ‌న్నీ ఎవ‌రికి ఫోన్ చేశాడు..!

బాల‌య్య అఖండ మాస్ జాత‌ర‌కు రంగం సిద్ధ‌మ‌వుతోంది. రూల‌ర్ త‌ర్వాత బాల‌య్య నుంచి మ‌రో సినిమా రాలేదు. బాల‌య్య – బోయ‌పాటి కాంబో అన‌డంతోనే ఎలాంటి అంచ‌నాలు ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. వీరి కాంబోలో వ‌చ్చిన సింహా సూప‌ర్ హిట్‌. లెజెండ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌. ఇప్పుడు అఖండ అంత‌కు మించిన బ్లాక్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అవ్వ‌డంతో పాటు వారి కాంబినేష‌న్‌ను హ్యాట్రిక్ చేస్తుంద‌నే అంద‌రూ అంటున్నారు.

ఇప్ప‌టికే రిలీజ్ అయిన బీబీ రోరింగ్‌, టీజ‌ర్‌, ఫ‌స్ట్ ట్రైల‌ర్ ఫ్యాన్స్‌కు పూన‌కాలు తెప్పిస్తున్నాయ్‌. ఇక నిన్న ప్రి రిలీజ్ ఈవెంట్‌లో అల్లు అర్జున్‌తో సెకండ్ ట్రైల‌ర్ లాంచ్ చేయించారు. ఈ ట్రైల‌ర్ చూస్తుంటే మాస్ జాత‌ర మామూలుగా ఉండ‌ద‌ని.. బాల‌య్య థియేట‌ర్ల‌లో దుమ్ము దులిపేయ‌డం ఖాయంగా ఉంద‌ని అంటున్నారు. ఇక సెకండ్ ట్రైల‌ర్ లాంచ్ చేసిన బ‌న్నీ బాల‌య్య – బోయ‌పాటి కాంబో గురించి తాను ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేద‌ని అన్నారు.

జ‌నాలు సింహాతో స్టార్ట్ చేశార‌ని.. లెజెండ్‌తో ఆ బ్లాక్‌బ‌స్ట‌ర్ ట్రాక్ కంటిన్యూ చేస్తున్నార‌ని.. ఇప్పుడు అఖండ‌తో అన్‌స్టాప‌బుల్‌గా ఉంద‌ని అర్థ‌మ‌వుతోంద‌ని స‌ర‌దాగా చెప్పారు. ఇక ట్రైల‌ర్ చూసిన‌ప్పుడే వండ‌ర్‌ఫుల్‌గా ఉంద‌ని త‌న‌కు అనిపించింద‌ని.. ఆ వెంట‌నే తాను బోయ‌పాటి గారికి ఫోన్ చేసి ట్రైల‌ర్ అదిరిపోయింద‌ని.. పూన‌కాలు వ‌చ్చేస్తున్నాయ‌ని చెప్పాన‌ని బ‌న్నీ చెప్పాడు.

ఇక థ‌మ‌న్ నెల రోజుల పాటు రీ రికార్డింగ్ చేస్తూ తాము తాండ‌వంలో ఉన్నామ‌ని అన్న మాట నిజం అని.. ఇప్పుడు ట్రైల‌ర్ చూస్తే ఆ ఎన‌ర్జీ అంతా ఇందులో క‌నిపిస్తోంద‌ని బ‌న్నీ చెప్పాడు. ఇక థ‌మ‌న్ ఇటీవ‌ల ముట్టుకుంద‌ల్లా బంగారం అవుతోంద‌ని.. కొట్టింద‌ల్లా సిక్సర్ అవుతోంద‌ని.. కెరీర్‌లో ఫుల్ ఫామ్‌లో ఉన్నాడ‌ని బ‌న్నీ ఆకాశానికి ఎత్తేశారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news