Moviesనితిన్ తొలి సినిమా జ‌యం షూటింగ్‌లో ఇంత పెద్ద ప్ర‌మాదం జ‌రిగిందా...

నితిన్ తొలి సినిమా జ‌యం షూటింగ్‌లో ఇంత పెద్ద ప్ర‌మాదం జ‌రిగిందా ?

నితిన్ తొలి సినిమా విడుద‌ల అయ్యి ఇప్ప‌ట‌కీ 19 సంవ‌త్స‌రాలు అయ్యింది. ఈ సినిమా అప్ప‌ట్లో పెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్. 2003లో ఈ సినిమా రిలీజ్ అయ్యింది. అయితే ఇన్నేళ్లకు ఈ సినిమా హీరోయిన్ స‌దా ఓ సంచ‌ల‌న విష‌యం బ‌య‌ట పెట్టింది. అయితే అప్ప‌ట్లో ఇప్పుడు ఉన్నంత ఫాస్ట్ టెక్నాల‌జీ లేదు కాబ‌ట్టి ఎవ‌రో ఒక‌రు చెపితే త‌ప్పా ఆ సినిమాల గురించి ఎవ్వ‌రికి ఈ త‌రం వాళ్ల‌కు పెద్ద‌గా తెలియ‌దు.

జ‌యం సినిమాతోనే నితిన్ తోపాటు స‌దా కూడా వెండితెర‌కు ప‌రిచ‌యం అయ్యారు. ఈ సినిమాతోనే మ‌రో 40 మంది నూత‌న న‌టీన‌టులు కూడా తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయ్యారు. ఇటీవ‌ల ఓ షోకు వ‌చ్చిన స‌దా ఆ సినిమా షూటింగ్ సంగ‌తులు ప్రేక్ష‌కుల‌తో పంచుకుంది. నెల్లూరు స‌మీపంలో ఓ అడ‌వి ప్రాంతంలో షూటింగ్ చేస్తున్నార‌ట‌. ఓ రోజు అడ‌విలో సుమో టైర్ పేలిపోవ‌డంతో వారు ప్ర‌యాణిస్తున్న కారు ఏకంగా మూడు ప‌ల్టీలు కొట్టింద‌ట‌.

ఆ టైంలో తాము చ‌నిపోతాము అనుకుని చాలా భ‌య‌ప‌డ్డాన‌ని స‌దా చెప్పింది. త‌న జీవితంలో అతి భ‌యంక‌ర‌మైన సంఘ‌ట‌న అదేనని ఆమె తెలిపింది. ప‌డిపోయిన‌ప్పుడు తాను పైకి లేచేందుకు ఎంత ప్ర‌య‌త్నించినా కుద‌ర్లేదని.. ఆ టైంలో ఏం చేయాలో కూడా త‌న‌కు అర్థం కాలేద‌ని నాటి భయంక‌ర సంఘ‌ట‌న గురించి ఆమె పంచుకుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news