Moviesకెరీర్ లో ఎప్పుడు చేయని బిగ్గెస్ట్ రిస్క్ చేస్తున్న ఈ యంగ్...

కెరీర్ లో ఎప్పుడు చేయని బిగ్గెస్ట్ రిస్క్ చేస్తున్న ఈ యంగ్ హీరో..బెడిసికొడితే..నెక్స్ట్ ఏంటీ..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకోవడం చాలా కష్టం అని చెప్పి కొంతమంది ఫెయిల్యూర్ పీపుల్ లిస్ట్ చూపిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా నిఖిల్‌ని చూసి నేర్చుకోవాలి. హ్యాపీడేస్‌తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన నిఖిల్ కూడా మొదట్లో మాస్ జపమే చేశాడు. నెక్ట్స్ టు రవితేజ అంటూ వరుస డిజాస్టర్స్ ఫేస్ చేశాడు. కానీ ఒక సారి ఫెయిల్యూర్ వచ్చిన తర్వాత మాత్రం కుంగిపోకుండా తన కెరీర్ గురించి తాను నిజాయితీగా విశ్లేషించుకున్నాడు. తను వెళ్తున్న రూట్ కరెక్ట్ కాదని తెలుసుకున్నాడు.

కట్ చేస్తే స్వామిరారా సినిమా నుంచి మనవాడి హ్యాపీడేస్ స్టార్ట్ అయ్యాయి. స్వామిరారా, కార్తికేయ, ఎక్కడికి పోతావు చిన్నవాడాతో సినిమాలతో సూపర్ హిట్స్ కొట్టాడు. దెబ్బకు మనవాడికి గోల్డెన్ డేస్ స్టార్ట్ అయ్యాయి. ఇలా వరుస విజయాలను అందుకొని మినిమం గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు నిఖిల్‌. ఇదిలా ఉంటే నిఖిల్‌ గతంలో ఎన్నడూ ఓ పనిని తన కెరీర్‌లో తొలిసారి చేస్తున్నట్లు ట్విట్టర్‌ వేదికగా ప్రకటించాడు. ఒక హీరో ఒకే టైంలో నాలుగు సినిమాల్లో నటించాలంటే మాత్రం కష్టమే. యువ కథానాయకుడు నిఖిల్ ఇప్పుడు ఈ సాహసమే చేస్తున్నాడు. ఆల్రెడీ అతను ‘18 పేజెస్’, ‘కార్తికేయ-2’ సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ రెండు చిత్రాలూ చివరి దశలో ఉన్నాయి. ఇంతలోనే గత కొన్ని వారాల్లో నిఖిల్ రెండు కొత్త చిత్రాలను అనౌన్స్ చేశాడు.

ఇప్పటిదాకా కెరీర్లో చాలా వరకు ఒకసారి ఒక సినిమా మాత్రమే చేస్తూ వచ్చానని.. కానీ ఇప్పుడు ఎన్నడూ లేని విధంగా ఏక కాలంలో నాలుగు సినిమాలు చేస్తున్నానని.. ఈ నాలుగు చిత్రాలూ తనకెంతో ఇష్టమైన స్క్రిప్టులతో తెరకెక్కుతున్నవని.. అందుకే అన్నింటికీ సమాన ప్రాధాన్యం ఇస్తున్నానని నిఖిల్ వెల్లడించాడు. వీటిలో దేనికి మొదటి స్థానాన్ని ఇవ్వాలో నాకు అర్థం కావడం లేదు. అన్ని సినిమాలకు నాలోని బెస్ట్‌ను ఇస్తున్నాను. అన్ని సినిమాలు మంచి సక్సెస్‌ కావాలని ప్రార్థిస్తున్నాను’ అంటూ పోస్ట్ చేసాడు.

Working on 4 Movies Simultaneously…

Never did this before.
Always worked only 1 at a time till now.. but this is like 4 kids who r all my favourites but don’t know whom to give max priority to.
Giving my best and praying tht all 4 of them get the best release and Success 🙏🏼🥰 pic.twitter.com/7FdZGsOEbb

— Nikhil Siddhartha (@actor_Nikhil) October 25, 2021

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news