Moviesభోళా శంక‌ర్ నుంచి అద్దిరిపోయే అప్డేట్..ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ..!!

భోళా శంక‌ర్ నుంచి అద్దిరిపోయే అప్డేట్..ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ..!!

ప్రస్తుతం చిరంజీవి వరుస సినిమాలకు సైన్ చేసుకుంటూ యంగ్ హీరోలకు తీసిపోకుండా టాలీవుడ్ లో తన స్టామినా చూపిస్తున్నారు. మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి 154వ చిత్రంగా ‘భోళా శంకర్‌’ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి మలయాళ ‘లూసిఫర్’ తోపాటుగా తమిళ ‘వేదాళం’ చిత్రాన్ని కూడా రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా దర్శకుడు శివ తెరకెక్కించిన చిత్రం ‘వేదాళం’. ఈ మూవీ తమిళంలో ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఈ సినిమాను తెలుగులో రీమేక్‌ చేసేందుకు ఎప్పటిచంచో ప్రయత్నాలు జరుగుతున్న్..లాస్ట్ కి చిరంజీవి ఈ సినిమాని రీమేక్ చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ పై మెహర్ రమేష్ గత మూడేళ్లుగా పనిచేసారట. సినిమాలో చిరు స్టార్డమ్ ని దృష్టిలో పెట్టుకుని స్క్రిప్టులో చాలా మార్పులే చేసారట.ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని అంద‌రు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న‌క్ర‌మంలో మేక‌ర్స్ క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. న‌వంబ‌ర్ 11న మూవీ పూజా కార్య‌క్ర‌మాలు జ‌ర‌గ‌నున్నాయ‌ని, 15 నుండి షూటింగ్ ప్రారంభం కానుంద‌ని తెలియ‌జేశారు.

మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో చిరంజీవికి చెల్లెలుగా కీలకపాత్రలో కీర్తి సురేష్ నటిస్తున్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా తమన్నా ఎంపికైన‌ట్టు స‌మాచారం. మణిశర్మ తనయుడు స్వర సాగర్ మహతి సంగీతం అందిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. వీటితో పాటు దర్శకుడు బాబీ దర్శకత్వంలో మరో చిత్రాన్ని చిరంజీవి ప్రకటించారు. మొత్తంగా రానున్న రెండేళ్ల కాలంలో చిరు నుండి క్రేజీ ప్రాజెక్ట్స్ రానున్నాయి. మెగా ఫ్యాన్స్ చిరు వరుస రిలీజ్ లతో పండగ చేసుకోనున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news