Moviesఒక్క స్కిట్‌కి హైపర్ ఆది ఎంత తీసుకుంటాడో తెలుసా..టోటల్ లెక్క తెలిస్తే...

ఒక్క స్కిట్‌కి హైపర్ ఆది ఎంత తీసుకుంటాడో తెలుసా..టోటల్ లెక్క తెలిస్తే కళ్లు జిగేల్..?

హైపర్‌ ఆది.. జబర్ధస్త్ అనే షో ద్వారా ప్రపంచానికి పరిచయమైన ఆది తనదైన శైలిలో కామెడీ పండిస్తూ హైపర్‌ ఆదిగా గుర్తింపు తెచ్చుకున్నాడు… చాలా తక్కువ సమయంలోనే ఊహించని రీతిలో పాపులర్ అయిపోయాడు. తనదైన కామెడీ టైమింగ్‌, పంచు డైలాగులతో షోని రక్తి కట్టిస్తాడు. ఇక ఏ షో చేసిన అందులో ఆడవాళ్లు, మహిళ యాంకర్స్‌పై అతడు వేసే డబల్‌ మీనింగ్‌ పంచ్‌లు మాములుగా ఉండవు. ఎంతటి వారినైనా అవి ఆకట్టుకుంటాయి.

ఆయన చేసే కామెడీ స్కిట్లు యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలుస్తాయి. తనదైన కామెడీ టైమింగుతో అలరించే హైపర్‌ ఆదికి బుల్లితెరపై మాంచి ఫాలోయింగ్‌ ఉంది. దీంతో ఆయన రెమ్యునరేషన్‌ కూడా భారీగానే ఉంటుందని టాక్‌. ఈవెంట్‌ను బట్టి హైపర్‌ ఆది పారితోషికం డిమాండ్‌ చేస్తాడని తెలుస్తుంది.అదే సమయంలో వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకెళ్తున్నాడు. ఎదుటి వారిపై పంచులు వేస్తూ బుల్లితెర ప్రేక్షకులకు ఎనలేని కామెడీని అందిస్తుంటాడు. ప్రస్తుతం ఓ వైపు జబర్దస్త్ మరోవైపు “ఢీ” షోలతో బిజీ బిజీగా ఉన్న ఇటు సినిమాలోను ఆఫర్లు క్యూ కడుతున్నాయి.

అయితే ఇప్పుడు అందరిని నవ్వించే ఆది.. ఒక్క స్కిట్‌కి గానూ లక్షల్లో పారితోషకం అందుకుంటాదని తెలుస్తుంది. దీన్ని బట్టి ఏడాదికి కోటి రూపాయలకు పైగానే సంపాదిస్తాడని టాక్ వినిపిస్తుంది. అటు బుల్లితెరతో పాటు అప్పుడప్పుడూ సినిమాల్లోనూ నటిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్న ఆది కామెడీ షోలతో తాజాగా హైదరాబాద్‌లో ఓ ఖరీదైన ఇంటిని కూడా కొనుగోలు చేసినట్లు సమాచారం. దీని బట్టి ఆది కి కోట్లల్లో ఆస్తి ఉన్నట్లు తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news