Moviesబాలీవుడ్ లోకి ఎంటర్ అవ్వడానికి ఇదే సరైన సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన...

బాలీవుడ్ లోకి ఎంటర్ అవ్వడానికి ఇదే సరైన సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన మహేష్ బాబు ..!!

ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రం సర్కారు వారి పాట. స‌రిలేరు నీకెవ్వ‌రు లాంటి సూప‌ర్ హిట్ త‌ర్వాత మ‌హేష్ న‌టిస్తోన్న ఈ సినిమాపై లెక్క‌కు మిక్కిలిగా అంచ‌నాలు ఉన్నాయి. మ‌హేష్ మూడు వ‌రుస హిట్ల‌తో ఫుల్‌స్వింగ్లో ఉన్నాడు. దీంతో స‌ర్కారు వారి పాట హిట్ అయితే మ‌హేష్ క్రేజ్ ఏ రేంజ్‌కు వెళ్లిపోతుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ప్రస్తుతం మహెష్ బాబు ఈ సినిమా షూటింగ్‌ లో బిజీ బిజీగా ఉన్నారు.

ఈ సినిమా పూర్తయిన తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. అయితే ఈ సినిమా కూడా పూర్తయిన తర్వాత మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నట్లు తెలిసిందే. మహేష్ తో సినిమా చేయబోతున్నాను అంటూ స్వయంగా రాజమౌళినే అన్నారు. ఇక అప్పటి నుండి ఈ సినిమా లేటెస్ట్ అప్డేట్ కోసం మహేష్ అభిమానులు ఆతౄతగ ఎదురుచుస్తున్నారు.

అయితే తాజాగా.. రాజమౌళితో సినిమా చేయడం గురించి మహేష్ కీలక కామెంట్స్ చేసారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మహేష్ మాట్లాడుతూ.. రాజమౌళితో పాన్ ఇండియా అరంగేట్రానికి సిద్దంగా ఉన్నాను అంటూ హీందిలో అరంగేట్రం చేయడానికి ఇదే సరైన సినిమా అన్నారు మహేష్. ఇక రాజమౌళి, మహేష్ సినిమా కోసం విజయేంద్రప్రసాద్ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు భార్య నమ్రత కూడా ఓ కీలక పాత్రల్లో కనిపించనుంది అని టాక్ వినిపిస్తుంది. మరి చూడాలి రాజమౌళి ఏం చేస్తారో..?

 

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news