MoviesF3 Movie: సర్ ప్రైజింగ్ వీడియో రిలీజ్ చేసిన చిత్ర...

F3 Movie: సర్ ప్రైజింగ్ వీడియో రిలీజ్ చేసిన చిత్ర యూనిట్..!!

అనీల్ రావిపుడి డైరక్షన్ లో దిల్ రాజు నిర్మాణంలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన మల్టీస్టారర్ మూవీ ఎఫ్-2కిందట ఏడాది సంక్రాంతికి సూపర్ హిట్ బొమ్మగా ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన ఎఫ్-2 సినిమా సూపర్ సక్సెస్ మూవీగా నిలిచిన విషయం తెలిసిందే. దాదాపు 80 కోట్ల కలక్షన్స్ తో దుమ్ముదులిపేసిన ఎఫ్-2 సినిమా సక్సెస్ మీట్ లోనే ఎఫ్-3 సినిమా ఎనౌన్స్ చేసి ఆడియెన్స్ లో క్యూరియాసిటీ పెంచారు.. డైరెక్టర్ అనీల్ రావిపుడి.

 

టాలీవుడ్ హీరోలు వెంక‌టేశ్ , వ‌రుణ్ తేజ్ న‌టిస్తోన్న చిత్రం ఎఫ్3 (F3).ఇందులో క‌థానాయిక‌లుగా తమన్నా, మెహరీన్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శక్వం అనిల్ రావిపూడి వహిస్తున్నారు మరియు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు సినిమాను నిర్మిస్తున్నారు. అనిల్ రావిపూడి ట్రాక్ రికార్డు చూసిన తర్వాత ఇప్పుడు ఎఫ్ 3 సినిమాపై అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. అందరికీ తెలిసిపోతుందంతే. వరసగా ఐదు విజయాల తర్వాత డబుల్ హ్యాట్రిక్ కోసం ఎఫ్ 3 సినిమా చేస్తున్నాడు అనిల్. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తొలి భాగంతో పోలిస్తే సీక్వెల్ మరింత కామెడీ ఉంటుందని.. పొట్టలు చెక్కలయ్యేలా అనిల్ రావిపూడి ఈ సినిమా స్క్రిప్ట్‌ను రెడీ చేసారట.

ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. ఫ‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ఎఫ్ 2కు కొన‌సాగింపుగా అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోంది ఎఫ్3. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్ డేట్ ను మేక‌ర్స్ అందించారు. తాజాగా మూవీకి సంబంధించిన వీడియో విడుద‌ల చేశారు మేక‌ర్స్.ఇందులో చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌ధారులు అంద‌రిని చూపిస్తూ అంద‌రిచేత ద‌స‌రాశుభాకాంక్ష‌లు చెప్పించారు. ఎఫ్ 3 చిత్రం డబ్బులతో వచ్చే సమస్యల చుట్టూ అల్లుకున్నట్టు సమాచారం. ఇది ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే ఖరారు చేసారు ఈ దర్శకుడు. అయితే కథ కూడా డబ్బుల చుట్టూనే తిరగనున్నట్లు తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news