Moviesసోషల్‌ మీడియాను దున్నేస్తున్న ఫీల్ గుడ్ మెలోడీ సాంగ్.. "అంత ఇష్టం...

సోషల్‌ మీడియాను దున్నేస్తున్న ఫీల్ గుడ్ మెలోడీ సాంగ్.. “అంత ఇష్టం ఏందయ్యా నీకు” ఫుల్ సాంగ్ రిలీజ్ ..!!

పవర్ స్టార్ పవన్, కండల వీరుడు రానా ప్రస్తుతం అయ్యప్పనుం అనే రీమేక్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్, భీమ్లా నాయక్ అనే పవర్ఫుల్ పోలీస్ అధికారిగా నటిస్తున్నాడు. మాస్ లో సాలిడ్ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రంలో దగ్గుబాటి రానా కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే మాస్ లో ఈ చిత్రంకి భారీ హైప్ కూడా ఇప్పుడు నెలకొంది.

 

ఇప్పటికే విడుదలైన “భీమ్లా నాయక్” టీజర్ సోషల్ మీడియాలో దుమ్మురేపింది. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా “భీమ్లా నాయక్” సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.ఆ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, హీరో ఎంట్రీ, యాక్షన్ ప్యాక్డ్ టీజర్ మెగాభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి విడుద‌లైన ఫస్ట్‌లుక్, ప్రచారా చిత్రాలు, ఫస్ట్‌ సింగిల్‌ ప్రేక్ష‌కులను బాగా ఆకట్టుకున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇక ఈ సినిమాలో పవన్‌కు జోడిగా నిత్యామీనన్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా వారిద్ద‌రికి సంబంధించిన ఓ అద్భుతమైన మెలోడీ సాంగ్ ను రిలీజ్ చేసారు మేకర్స్. ఆ పాటా ప్రోమో యూట్యూబ్ ని షేక్ చేస్తుంది. “అంత ఇష్టం ఏంద‌య్యా” ప్రోమో సాంగ్‌ని అక్టోబ‌ర్ 14న విడుద‌ల చేశారు మేక‌ర్స్. తాజాగా ఫుల్ సాంగ్ రిలీజ్ చేయ‌గా, ఇది శ్రోత‌ల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. ‘అంత ఇష్టం ఏందయ్యా..’ అంటూ సాగే పాటను ప్రముఖ గేయ రచయిత రామ జోగయ్య శాస్త్రీ రాయగా.. సింగర్‌ చిత్ర ఆలపించారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news