Moviesబన్నీ కోసం సూపర్ ఫిగర్ ని పట్టిన సుక్కు..ఇక "పుష్ప" లో...

బన్నీ కోసం సూపర్ ఫిగర్ ని పట్టిన సుక్కు..ఇక “పుష్ప” లో ఐటెం సాంగ్ సూపరో సూపర్..?

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ రేంజ్‌, క్రేజ్ ఇప్పుడు ఎలా పెరిగిపోయిందో ప్ర‌త్యేకంగా చెప్పనవసరం లేదు. తన లాస్ట్ బ్లాక్ బస్టర్ అల వైకుంఠ‌పురం సినిమాకు ముందు వ‌ర‌కు బ‌న్నీ వేరు.. ఇప్పుడు బ‌న్నీ వేరు. ఇప్పుడు బ‌న్నీ క్రేజ్ మ‌హేష్‌బాబు, ఎన్టీఆర్‌, ప‌వ‌న్‌ల‌ను మించే ఉంద‌ని చెప్పాలి. సినిమాలు, సోష‌ల్ మీడియా, ఇత‌ర భాష‌ల్లో మార్కెట్‌, క‌లెక్ష‌న్లు ఇవ‌న్నీ పై ముగ్గురు క్రేజీ హీరోల‌ను మించి పోయి బ‌న్నీకి ఉన్నాయి.

గ‌త బ్లాక్ బ‌స్ట‌ర్ అల త‌ర్వాత ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పుష్ప సినిమా చేస్తున్నాడు. ఇటు సుక్కు కూడా రంగ‌స్థ‌లం లాంటి యునాన‌మ‌స్ బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని పుష్ప మీదే వ‌ర్క్ చేస్తున్నాడు. ‘ఆర్య’, ‘ఆర్య2’ తర్వాత సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ సినిమా ‘పుష్ప’.రెండు భాగాలుగా విడుదల అవుతున్న ఈ సినిమా తొలి భాగం డిసెంబర్‌లో విడుదల అవుతోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను భారీ స్థాయిలో పాన్‌ ఇండియా లెవల్‌ తీస్తున్నారు మేకర్స్‌.

తాజాగా ఈ క్రేజీ చిత్రానికి సంబంధించిన ఆస‌క్తిక‌ర వార్త అటు బీటౌన్ తోపాటు ఇటు టాలీవుడ్ స‌ర్కిల్ లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఎప్ప‌టిలాగే ఈ చిత్రంలో కూడా ఓ ఐటెంసాంగ్ ను పెట్టాడు సుకుమార్. కాగా ఈ పాట‌లో బన్నీతో చిందులు వేయడానికి బాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్ నోరా ఫతేహి ను ఫిక్స్ చేసారట. ఇప్పటికే ఈ డేట్స్ సర్ధుబాటు చేసిన ఆమె.. ఈ పాట కోసం ఏకంగా రూ.3 కోట్లు రెమ్యున‌రేష‌న్ తీసుకుంటుందట. ఒక్క సాంగ్ కే సుక్కు ఇంత ఖర్చు చేస్తున్నాడు అంటే.. ఇందులో ఏదో భారి స్పెషాలిటి పెట్టే ఉంటాడు అంటూన్నరు ఆయన అభిమానులు. మరి చూడాలి బన్నీ నోరా ఫతేహి ఈ సాంగ్ లో డ్యాన్స్ ఎలా చేస్తారో..బన్నీ ఫాస్ట్ కి ఆమె ఎలా తట్టుకుంటుందో..?

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news