Moviesయాంకర్ గా మారనున్న స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్..ఆ షో...

యాంకర్ గా మారనున్న స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్..ఆ షో కోసమే..?

నేటి కాలంలో స్టార్ హీరో, హీరోయిన్ లు అన్ని రంగాల్లో అడుగుపెడుతున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది హీరో లు హోస్ట్ గా పలు షో స్ చేసారు కూడా. మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుండి దగ్గుబాటి వారసుడు రానా వరకు అందరు యాంకర్ లు గా చేసి సత్తా చాటిన వాళ్లే. మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగారజున, యంగ్ టైగర్ తారక్, దగ్గుబాటి రానా, నాటురల్ స్టార్ నాని ,హీరోయిన్స్ లో రోజా..ఇలా అందరు బుల్లితెర పై సందడి చేసిన వారే.

తాజాగా ఆ లిస్ట్ లో కి ఓ స్టార్ హీరోయిన్ పేరు చేరబోతుందా..? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. యస్.. అందాల నటి..కాదు కాదు మహానటి సినిమా తో తానేంటో ప్రూవ్ చేసుకున్న భామ..కీర్తి సురేష్. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించిన ఈ అందాల ముద్దుగుమ్మ..తాజాగా బుల్లితెర పై సందడి చేయడానికి సిద్ధమౌతుంది అని అంటున్నారు . ప్ర‌ముఖ ఛానల్‌లో త్వ‌ర‌లో ప్రారంభం కానున్న ఒక కార్య‌క్ర‌మానికి కీర్తి సురేశ్ యాంక‌రింగ్ చేయ‌బోతోందట. కేవ‌లం తెలుగులోనే కాకుండా నాలుగు భాష‌ల్లో భారీ స్థాయిలో ఈ షో మొద‌లుపెడుతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇందులో కీర్తి సురేశ్ కేవ‌లం హోస్ట్‌గానే కాకుండా.. గేమ్స్ ఆడిస్తూ.. వ‌చ్చిన గెస్ట్‌ల‌తో ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూలు కూడా చేయ‌బోతోన్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఈ కార్య‌క్రమానికి కీర్తి సురేశ్ భారీగానే పారితోషికం తీసుకుంటున్న‌ట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది కీర్తి సురేశ్‌. మహేష్ బాబు సర్కారు వారి పాట, నాని దసరా, చిరంజీవి భోళా శంకర్ సినిమాలతో చాలా బిజీగా ఉంది కీర్తి సురేశ్‌. ఇలాంటి సమయంలో కూడా బుల్లితెరపైకి ఎంట్రీ ఇస్తోంది ఈ మహానటి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news