Moviesయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు ఊహించని బిగ్ షాక్..!!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు ఊహించని బిగ్ షాక్..!!

డార్లింగ్ ప్రభాస్ హీరోగా రాబోతున్న మరో భారీ సినిమా ‘సలార్’. పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ మూవీగా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో డార్లింగ్ సరసన శ్రుతి హసన్ హీరోయిన్‏గా నటిస్తోంది. కేజీఎఫ్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ భారీ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్ కెరీర్ లో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేస్తుందని టాక్. పాన్ ఇండియా లెవల్లో భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ సినిమాలో షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే ఇందులో ప్రభాస్ లుక్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న వేళ..సలార్ టీంకు భారీ షాక్ తగ్గిలింది.

సలార్ సినిమా కోసం ఇండియాలోనే ఇంతకు ముందెన్నడు లేని హై ఎండ్ హాలీవుడ్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. మ్యాట్రిక్స్, బ్యాట్ మ్యాన్ వంటి హాలీవుడ్ చిత్రాలకు ఉపయోగించిన టెక్నాలజీతో సలార్ సినిమాను తెరకెక్కిస్తున్నారని సమాచారం. అయితే సలార్ సెట్స్ నుండి ప్రభాస్ వీడియో, కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. గతంలో ఫస్ట్ షెడ్యూల్ లో మైన్స్‌లో షూటింగ్ జరుగుతున్న సమయంలో లొకేషన్ నుంచి ప్రభాస్ లుక్ లీకై మేకర్స్ కి షాకిచ్చింది.

ఇప్పుడు ఏకంగా ప్రభాస్ కి సంబంధించిన చిన్న వీడియో లీకై మేకర్స్ కంగారు పెడుతుంది. ఈ క్రమంలో సలార్‌ మూవీ సెట్‌ ప్రభాస్‌పై చిత్రీకరిస్తున్న యాక్షన్‌ సీన్‌ మేకింగ్‌ వీడియో ఒకటి లీక్‌ అయ్యింది. ఈ వీడియోలో ప్రభాస్‌తో చేతిలో గన్‌, చూట్టు సంచలను చూస్తుంటే ఇది హోరాహోరిగా సాగే ఫైట్‌ సీన్‌ అని అర్థమవుతోంది. ఆ వీడియో ప్రభాస్ లుక్ చూసిన అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మరి ఇకపై నుంచైనా మేకర్స్ కఠినంగా వ్యవహరించి ఏ లీకులు రాకుండా ఉంటాయేమో చూడాలి .

 

Here is the leaked bit for out fans 💥#PrabhasBirthdayCDP #Prabhas #Salaar

Kutha ramp antey edhey nemo 💥💥 pic.twitter.com/AIJ0YzD0o5

— PRABHAS UPDATES OFFICIAL (@PRABHASUPDATESS) October 19, 2021

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news