MoviesRRR సినిమా ప్రమోషన్స్ కోసం రాజమౌళి సరికొత్త ప్లాన్..వావ్ అనాల్సిందే..!!

RRR సినిమా ప్రమోషన్స్ కోసం రాజమౌళి సరికొత్త ప్లాన్..వావ్ అనాల్సిందే..!!

‘బాహుబలి’ సినిమాతో తెలుగు సినిమా సత్తాను ఎల్లలు దాటించిన రాజమౌళి.. మళ్ళీ అదే రేంజ్‌లో RRR రూపొందిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న చిత్రం ‘రౌద్రం, రణం, రుధిరం. ఎస్. ఎస్. రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మొదటిసారి కలిసి నటిస్తున్న సినిమా ఇది.పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సుమారు 450 కోట్ల భారీ బడ్జెట్ తో దానయ్య నిర్మిస్తున్నారు.

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి బాహుబ‌లి సీరిస్ త‌ర్వాత ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తోన్న ఆర్ ఆర్ ఆర్ సినిమా .. చిన్నచిన్న షాట్లు మినహా ఈ సినిమా షూటింగ్ అంతా పూర్తయినట్లు ఈ మధ్యకాలంలోనే చిత్ర యూనిట్ ప్రకటించింది. అదిగో రిలీజ్ ఇదిగో రిలీజ్ అని యేడాదిన్న‌ర కాలంగా ఊరిస్తూ వ‌స్తున్నారు. ఇప్ప‌టికే రెండు మూడు డేట్లు వేసి మ‌రీ రిలీజ్ అని చెప్పి.. వాయిదాల మీద వాయిదాలు వేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ సినిమా ను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

అయితే జక్కన్న మాత్రం ఈ సినిమా ప్రమోషన్స్ ని బాగా సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తుంది. RRR సినిమా ప్రమోషన్స్ ని అన్ని భాషల్ని కవర్ అయ్యేలా చేస్తూ .. అక్కడి స్థానిక భాషల్లోనే చిత్రబృందం ప్రచారం నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నాడట జక్కన్న. అంతేకాదు డిండోరాతో క‌లిసి ఈ సినిమాపై మ‌రింత ఆస‌క్తి క‌లిగేలా ప్ర‌మోష‌న్స్ ప్లాన్ చేస్తున్నార‌ట‌. యూట్యూబ‌ర్ ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని వీలైనంత‌గా ప్ర‌మోట్ చేయ‌డంతో పాటు చిత్ర ప్ర‌ధాన పాత్రధారులు జూనియ‌ర్ ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌, అజ‌య్ దేవ‌గ‌ణ్‌, అలియా భ‌ట్ వంటి స్టార్స్‌ని ఇంట‌ర్వ్యూలు చేసి మ‌రింత‌గా ప్ర‌చారం క‌లిపించే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారట‌.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news