సమంత.. అక్కినేని నాగారజున పెద్ద కోడుకు నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తరువాత కూడా మీడియాలో హాట్ టాపిక్ గా ఉంటుంది. ఈ మధ్యనే తనపై తప్పుడు వార్తలు రాస్తున్నరంటూ కోర్టుకెక్కిన ఈ అమ్మడు..ఎట్టకేలకు తను అనుకునంది సాధించింది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు కూకట్‌పల్లి హైకోర్టులో ఊరట దక్కింది. తన ప్రతిష్టకు భంగం వాటిల్లేలా వీడియోలు అప్‌లోడ్ చేస్తున్నారంటూ రెండు యూట్యూబ్ ఛానెల్స్(సుమన్ టీవీ, తెలుగు పాపులర్ టీవీ), డాక్టర్ సీఎల్ వెంకట్రావుపై చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. ఆ లింక్స్ వెంటనే డిలిట్ చేయాలని వార్నింగ్ ఇచ్చింది.
అలాగే సమంత కి కూడా పర్సనల్ ఇన్ ఫర్ మేషన్ పోస్ట్లు పెట్టదు అని హెచ్చరించింది. ఫైనల్ గా తను అనుకున్నది సాధించిన సమంత విడాకుల మ్యాటర్ నుంది బయటపడటానికి వరుస సినిమాలకు సైన్ చేస్తూ..బిజీ గా ఉండేటట్లుగా ట్రై చేస్తుంది. అయితే సమంత తాజాగా చేసిన పోస్ట్ తో మళ్లి మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ ముద్దుగుమ్మ తాజగా తన ఇన్‌స్టాలో మరో ఆసక్తికర పోస్ట్ చేసింది.
“మీ కూతురిని ఎవరు పెళ్లి చేసుకుంటారాని కంగారు పడకుండా తనని సమర్థంగా తీర్చిదిద్దండి. తన పెళ్లి కోసం డబ్బు ఆదా చేసే బదులు తన చదువుకు ఖర్చు పెట్టండి.అలాగే తనని తాను ప్రేమించుకోవడం, ఆత్మవిశ్వాసంతో ఉండటం నేర్పించండి. మరీ ముఖ్యంగా ఆమెను పెళ్లికి సిద్ధం చేసే బదులు, ఆమె కోసం ఆమెను సిద్ధం చేయండి. ఇతరులకు అవసరం అయిన సమయంలో మార్గదర్శకంగా ఉండేలా సిద్ధం చేయండని ’ అనే పోస్ట్‌ను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ అమ్మడు చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.