Newsమోస్ట్ కాస్ట్లీ చేప..ధర తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే..!!

మోస్ట్ కాస్ట్లీ చేప..ధర తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే..!!

చేపలు మాంసకృత్తులను సమృద్ధిగా కల్గిన ఒక ముఖ్యమైన సముద్రపు ఆహారం.అంతేగాక చేపలు రుచికరమైన ఆహారంగా ప్రసిద్ధి. వాస్తవానికి, ప్రపంచ ప్రోటీన్లో ఆరింటా ఒక వంతు చేపల నుండే వస్తుంది. పురాతన కాలం నుండి మానవులు చేపల్ని ఆహారంగా ఉపయోగిస్తున్నారు. అనేక నాగరికతల్లో చేపలు ఒక ముఖ్యమైన ఆహారంగా ఉంది. దాని తలతో సహా మొత్తం చేపను తినవచ్చును . అందువల్ల, అనేక రకాల చేప-ఆధారిత వంటకాలను ప్రపంచ వంటల్లో మనం చూడవచ్చు.

చేపల ఆహారం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రోగాల నుంచి చేప‌లు ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తాయి. అయితే కొన్ని చేప‌లు రుచితో పాటుగా ఖ‌రీదు కూడా ఎక్కువే.. అలాంటి వాటిల్లో ఇది కూడా ఓకటి. ఎన్ని చేప‌లు తిన్నా కూడా మాత్రం మ‌నం జ‌న్మ‌లో ఈ చేప‌ను మాత్రం తిన‌లేము. ఎందుకంటే ఇది ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన చేప‌. దీని పేరు బ్లూఫిన్ టూనా. అస‌లు ఈ చేప దొర‌క‌నే దొర‌క‌దు. ఈ చేప‌ను చూస్తే చాలు అని అనుకునేవాళ్లు ఎంతోమంది ఉంటారు. వీటికుండే డిమాండ్ వల్ల ఈ జాతి చేప‌లు అంత‌రించి పోతున్నాయ‌ట‌.

అందుకోకొంత దీనికి అంత డిమాండ్. కోట్ల రూపాయలు వెచ్చించి కొనటానికి కూడా వెనుకాడరు అంటే దీనికుండే డిమాండ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. కాగా తాజాగా బ్లూఫిన్ టూనా చేప బ్రిటన్ సముద్రంలో కనిపించింది. యూకేలోని కార్న్‌వాల్‌లో దీన్ని చూసిన ఓ వాలంటీర్ దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయటంతో మరోసారి ఈ బ్లూఫిన్ టూనా చేప వార్తల్లోకి వ‌చ్చింది. ఇటీవ‌ల జ‌పాన్‌లో 278 కిలోల బ‌రువైన బ్లూఫిన్ టూనా చేప దొరికింది. ఈ అరుదైన చేప‌ను 2.5 మిలియ‌న్ పౌండ్ల‌కు వేలంలో అమ్మేశారు. అంటే మన క‌రెన్సీలో దాదాపు రూ.25 కోట్ల రూపాయ‌ల పైమాటే. వామ్మో ఇంత ఖ‌రీదా అని నోరెళ్ల‌బెట్ట‌కండి. కానీ యూకేలో ఈ చేపను వేటాడటం, దాన్ని అమ్మటం నిషేధం. ఒకవేళ సముద్రంలో చేపలు పడుతుండగా.. ఆ చేప దొరికినా కూడా దాన్ని సముద్రంలో వదిలేయాలి.

Latest news